PPF Rules Updates: పీపీఎఫ్ వడ్డీ రేట్లలో కొత్త నిబంధనలు, పెరగనున్న వడ్డీరేటు

PPF Rules Updates: పీపీఎఫ్ నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వడ్డీ రేట్ల పెంపుకు ముందే ప్రభుత్వం మార్పులు చేసింది. పీపీఎఫ్ వడ్డీ రేటు కూడా పెరిగే అవకాశాలున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 4, 2022, 03:52 PM IST
PPF Rules Updates: పీపీఎఫ్ వడ్డీ రేట్లలో కొత్త నిబంధనలు, పెరగనున్న వడ్డీరేటు

పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన లేదా ఎన్‌పీఎస్ వంటి పధకాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేసే అప్‌డేట్స్ గురించి తెలుసుకోవాలి. ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం ఈ పథకాల వడ్డీ రేట్లపై సమీక్ష చేస్తుంటుంది. గత జూన్ త్రైమాసికంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 

తక్కువ డబ్బుతో ఎలా ఈ పథకాలు ప్రారంభించి..ఏడాదిలోగా 1.50 లక్షల వరకూ జమ చేయవచ్చో తెలుసుకుందాం. ఈ పథకం పూర్తిగా సురక్షితం. ప్రభుత్వం ఇటీవల పీపీఎఫ్ వడ్డీ రేటును 7.10 శాతం చేసింది. గత కొన్నేళ్లులో ఈ పథకం నియమాల్లో మార్పులు జరిగాయి. పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో 50 రూపాయలతో కూడా ప్రారంభించవచ్చు.  ఏడాదికి కనీసం 500 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. కానీ పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో ఏడాది వ్యవధిలో 1.5 లక్షల వరకూ జమ చేయవచ్చు. దీనిపై ట్యాక్స్ మినహాయింపు కూడా వర్తిస్తుంది. పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో నెలలో ఒకసారే డబ్బులు జమ చేయగలరు. 

పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో ఉన్న మొత్తంపై రుణం తీసుకోవచ్చు. ఇటీవల ఈ వడ్డీరేటును 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. రుణం మూలధనం చెల్లింపు తరువాత రెండు కంటే ఎక్కువ వాయిదాల్లో చెల్లింపు చేయాలి. వడ్డీ లెక్కింపు ప్రతి నెల మొదటి తేదీన ఉంటుంది. 15 ఏళ్ల వరకూ పెట్టుబడి పెట్టిన తరువాత అవసరమైతే పెట్టుబడి పెట్టకుండా అలానే ఉంచేయవచ్చు. 15 ఏళ్లు పూర్తయిన తరువాత ఎక్కౌంట్‌లో డబ్బుులు జమ చేయవచ్చు. పీపీఎఫ్ ఎక్కౌంట్ మెచ్యూరిటీ తరువాత ఒక ఏడాదిలో ఒకసారి డబ్బులు తీయవచ్చు.

పీపీఎఫ్ ఎక్కౌంట్ తెరిచిన తరువాత ఫామ్ ఏ స్థానంలో ఫామ్ 1 భర్తీ చేయాలి. 15 ఏళ్ల తరువాత పీపీఎఫ్ ఎక్కౌంట్‌ను మెచ్యూరిటీ కంటే ముందు పెంచాలంటే ఫామ్ 4 నింపాలి. పీపీఎఫ్ ఎక్కౌంట్‌పై రుణం తీసుకోవచ్చు. ఎక్కౌంట్‌లో ఉన్న నగదుపై 25 శాతం రుణం తీసుకోవచ్చు. 

Also read: Flipkart Offers: బిగ్ దసరా సేల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్స్‌పై భారీ డిస్కౌంట్స్‌.. త్వరపడండి ఇప్పుడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News