Provident Fund Scheme Latest Interest Rates: ప్రస్తుతం ఎక్కువమందిని ఆకర్షిస్తున్న పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు సురక్షితంగా ఉండడంతోపాటు ప్రభుత్వం మంచి వడ్డీ రేటును అందిస్తోంది. అందుకే చాలా మంది ప్రజలు పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న మొత్తాల పొదుపు పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన వడ్డీ రేట్లను ప్రకటించింది. అయితే పీపీఎఫ్ వడ్డీ రేటు విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు.
పీపీఎఫ్ వడ్డీ రేట్లను వరుసగా 12వ త్రైమాసికంలో కూడా కేంద్ర ప్రభుత్వం మార్చలేదు. గతంలో ఉన్న 7.1 శాతం వడ్డీ రేటునే ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్‌లో ఏడాదికి కనీసం రూ.500 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తానికి మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. నెలనెలా పీపీఎఫ్‌లో డబ్బులు జమ చేసుకోవచ్చు.
15 ఏళ్ల తర్వాత పీపీఎఫ్ పథకం మెచ్యురిటీ పూర్తవుతుంది. ఆ తరువాతే మీ చేతికి డబ్బు వస్తుంది. 15 ఏళ్లు పూర్తయిన తరువాత ఈ పథకాన్ని ఐదేళ్ల బ్లాక్ సమయం ప్రకారం పొడిగించవచ్చు. ఈ పథకంలో లోన్ కూడా పొందొచ్చు. ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన మూడో ఆర్థిక సంవత్సరం తర్వాత రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. లోన్ ఆప్షన్ ఆరో ఆర్థిక సంవత్సరం చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో.. రెండు సంవత్సరాల చివరిలో లభించే మొత్తంలో గరిష్టంగా 25 శాతాన్ని మాత్రమే లోన్‌గా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ లోన్‌పై పీపీఎఫ్‌పై ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటు కంటే ఒక శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1% ఉండగా.. మీరు తీసుకునే లోన్‌పై వడ్డీ రేటు 8.1 శాతం అవుతుంది.
Also Read: Bal Jeevan Bima Yojana: రోజుకు కేవలం రూ.6 పెట్టుబడి పెట్టండి.. మీ పిల్లలను లక్షాధికారిని చేయండి
ఏ పథకంపై ఎంత వడ్డీ అందుతోంది..?
==> సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 8 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది.
==> నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ)పై వడ్డీ రేటు 7 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగింది.
==> సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును 7.6 శాతం నుంచి 8 శాతానికి పెంచారు.
==> కిసాన్ వికాస్ పత్రాన్ని 7.2 శాతం (120 నెలలు) నుంచి 7.5 శాతానికి (115 నెలలు) పెంచారు.
Also Read: Best Saving Schemes 2023: ఈ మూడు పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి.. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook