Budget 2022: కేంద్రం ఆ ప్రకటన చేస్తే- పీపీఎఫ్​ ద్వారా రూ.80 లక్షల ఆదాయం!

Budget 2022: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది. పీపీఎఫ్​ పెట్టుబడిదార్లు పద్దు నుంచి ఏం కోరుకుంటున్నారు?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 01:32 PM IST
  • బడ్జెట్​పై పీపీఎఫ్ పెట్టుబడిదారులు భారీ ఆశలు
  • గరిష్ఠ పరిమితి పెంచాలని కేంద్రానికి వినతి
  • పన్ను పరిమితీ పెంచితేనే ప్రయోజనం అంటున్న నిపుణులు
Budget 2022: కేంద్రం ఆ ప్రకటన చేస్తే- పీపీఎఫ్​ ద్వారా రూ.80 లక్షల ఆదాయం!

Budget 2022: చిన్న మొత్తాల్లో పొదుపు పథకాల్లో ఎక్కువగా ఆదరణ పొందిన వాటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్​) కూడా ఒకటి. ఈ పథకంలో మంచి రాబడి ఉండటమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వం హామీ ఉండటం (PPF Benefits) ఇందుకు కారణం.

ఇంకో విషయమేమిటంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అసలుతో పాటు, వడ్డీపైనా పన్ను మినహాయింపు కూడా (Tax exemption on PPF) పొందొచ్చు. అందువల్ల సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారంతా ఈ పథకంవైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ పథకంపై ఆసక్తి కనబరుస్తుంటారు.

పీపీఎఫ్ గురించి..

పీపీఎఫ్​ ఖాతాలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి (Investment limit in PPF) పెట్టొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్​పై వార్షిక వడ్డీ 7.10 శాతంగా ఉంది.

స్థిరమైన ఆదాయం, నెల నెలా వేతనాలు పొందని వారికి లేదా అసంఘటిత రంగాల్లోని వారికి ఈ పథకం ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే వ్యక్తిగత ఆర్థిక నిపుణులు వీటినే ఎక్కువగా సూచిస్తుంటారు.

బడ్జెట్​పై భారీ అంంచనాలు..

2022-23కు సంబంధించి కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్ (Budget 2022-23) ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) పద్దు ప్రవేశపట్టనున్నారు. మరి ఈ సారి బడ్జెట్ నుంచి పీపీఎఫ్ పెట్టుబడిదారులు ఏం ఆశిస్తున్నారు? అనే విషయాలు ఇలా (Budget Expectations) ఉన్నాయి.

ఈ నేపథ్యంలో పీపీఎఫ్​లో వార్షిక పెట్టబడి పరిమితి పెంపు ప్రధాన డిమాండ్​గా వినిపిస్తోంది. ఎందుకంటే.. మారుతున్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కొవిడ్ నేపథ్యంలో పెరిగిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరిమితి పెంపు ఉండాలని మదుపరులు ఆశిస్తున్నారు. బడ్జెట్​లో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉండాలని పలువురు ఆర్థిక నిపుణులు కూడా కేంద్రానికి సూచిస్తున్నారు.

పన్ను మినహాయింపు పెంచాలి...!

పీపీఎఫ్​లో వార్షిక పెట్టుబడి మొత్తం పరిమితి పెంచడం సహా.. పన్ను మినహాయింపు కూడా పెంచాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం పెట్టుబడి పరిమితి అయిన రూ.1.5 లక్షలపై ఆదాయాపు పన్ను చట్టం 80 సీ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తోంది. అయితే కేంద్రం ఈసారి బడ్జెట్​లో పెట్టుబడి పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే.. పన్ను మినహాయిపు పరిమితి కూడా రూ.3 లక్షలకు పెంచాలని అంటున్నారు నిపుణులు. అప్పుడే సామాన్యులకు ఈ పథకం ద్వారా అందే ప్రతి ఫలాలు పూర్తిగా లభిస్తాయని చెబుతున్నారు.

పెట్టుబడితో పాటు పన్ను పరిమితి పెంచితే..

ఈ సారి బడ్జెట్​లో.. పీపీఎఫ్​ పెట్టుబడి పరిమితితో పాటు పన్ను మినహాయింపు పెంచితే సామాన్యుల ఆదాయం భారాగా పెరిగే అవకాశముంది.

సాధారణంగా పీపీఎఫ్ మెచ్యూరిటీ 15 ఏళ్లు. ప్రతి ఏటా ప్రస్తుత గరిష్ఠమైన రూ.1.50 లక్షల జమ చేస్తూ పోతే (7.1 శాతం వడ్డీ వద్ద).. మెచ్యూరిటీ సమయానికి రూ.4,068,209 పొందొచ్చు. ఇందులో రూ.2,250,000 లక్షలు అసలు కాగా.. రూ.1,818,209 వడ్డీ. మెచ్యూరిటీ సమయాన్ని ఐదేళ్ల చొప్పున పెంచుకునే వెసులుబాటు ఉన్నందున.. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశముంది.

అయితే బడ్జెట్​ 2022లో ఈ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే.. 7.1 శాతం వడ్డీ రేటు వద్దే.. 15 ఏళ్ల తర్వాత రూ.8,136,418 పొందొచ్చు. అయితే ఇందుకు ఆదాయాపు పన్ను చట్టాల్లో కూడా మార్పులు అవసరమని నిపుణులు అంటున్నారు. మరి కేంద్రం దీనిపై ప్రకటన చేస్తుందా? లేదా అనేది ఫిబ్రవరి 1న తెలియనుంది.

Also read: Gold Price Today: పెరిగిన బంగారం ధరలు, దేశంలోని ప్రధాన నగరాల్లోని ఇవాళ్టి పసిడి ధరలు..

Also read: Operating System: త్వరలో మేకిన్ ఇండియా ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్, యాపిల్ మార్కెట్‌కు దెబ్బేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News