Post Office: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్ ఇదే..రూ. 5లక్షలు ఇన్వెస్ట్ చేస్తే..రూ. 10లక్షలు మీ సొంతం

Post Office: మీరు ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం ఇచ్చే స్కీములో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా. అయితే పోస్టాఫీసు అందిస్తూన్న ఈ స్కీమ్ మీకు బెస్ట్ ఆప్షన్. ఇందులో రూ. 5లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 10 లక్షలను వస్తాయి. అది కూడా కేవలం 10ఏళ్లనే మీ చేతికి అందుతాయి. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Dec 22, 2024, 09:25 PM IST
 Post Office: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్ ఇదే..రూ. 5లక్షలు ఇన్వెస్ట్ చేస్తే..రూ. 10లక్షలు మీ సొంతం

Post Office: మీరు సంపాదిస్తున్న దాంట్లో నుంచి కొంత పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అందులో మనకు ఏది సరైందో నిర్ణయించుకోవడంలోనే అసలు విషయం దాగి ఉంటుంది. రిస్క్ తీసుకునే సామర్థ్యం, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలు వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. చాలా మంది రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా 6ఏళ్ల వయస్సు దాటిన సీనియర్ సిటిజన్లు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టే మార్గాలను సెర్చ్ చేస్తుంటారు. అలాంటి వారికి పోస్టాఫీస్ అందిస్తూన్న టర్మ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 

పోస్టాఫీసు FDని పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అంటారు. మీరు పోస్టాఫీసులో 1, 2, 3, 5 సంవత్సరాల పాటు ఎఫ్డీ ఆప్షన్ ఉంటుంది. మీరు 10 సంవత్సరాల పాటు ఇందులో డబ్బును డిపాజిట్ చేస్తే, మీరు మీ మొత్తాన్ని రెట్టింపు కంటే ఎక్కువ పొందవచ్చు. ప్రస్తుతం, 5 సంవత్సరాల FDపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం, పోస్టాఫీసు FDపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు పోస్టాఫీసులో రూ. 5 లక్షలు డిపాజిట్ చేశారనుకుందాం. ఆపై 7.5 శాతం చొప్పున మీకు రూ. 2,24,974 లక్షల వడ్డీ వస్తుంది. ఈ విధంగా, 5 సంవత్సరాలలో మీ మొత్తం రూ. 7,24,974 అవుతుంది. ఇప్పుడు మీరు దాన్ని మళ్లీ 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే, ఈ మొత్తం రూ. 10,51,175కి మెచ్యూర్ అవుతుంది. ఇది రెట్టింపు కంటే ఎక్కువ.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర..ఎంత పెరిగిందంటే?  

1 సంవత్సరానికి స్థిరంగా ఉంటే - 6.9%

2 సంవత్సరాలు స్థిరంగా ఉంటే - 7.0%

3 సంవత్సరాలకు స్థిరంగా ఉంటే - 7.0%

5 సంవత్సరాలకు స్థిరంగా ఉంటే - 7.5%

అయితే పోస్టాఫీస్ అందిస్తున్న మూడేళ్లు, ఐదేళ్ల టెన్యూర్ టైమ్ డిపాజిట్ స్కీములను పొడిగించుకోవాలనుకుంటే మెచ్యూరిటీకి 18నెలలోపుగా తెలియాజేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖాతా ఓపెన్ చేసేటప్పుడు మెచ్యూరిటీ తర్వాత పొడిగించుకునే ఛాన్స్ కల్పించాలని అభ్యర్థన పెట్టవచ్చు. మెచ్చూరిటీ రోజు సంబంధిత టీడీ అకౌంట్ పై వర్తించే వడ్డీ రేటు పొడిగించిన వ్యవధిలోనూ ఇది వర్తిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షిస్తుంటుంది. కొన్నిసార్లు పెంచడం, కొన్ని సార్లు తగ్గించడం వంటివి చేస్తుంది. కొన్నిసార్లు యథాతథంగానూ కొనసాగిస్తూనే ఉంటుంది. 

Also Read:School Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఏకంగా 15 రోజులు సెలవులు ఎక్కడంటే

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

Trending News