వివిధ పథకాల్లో లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది కానీ తగిన మొత్తంలో డబ్బుల్లేక వెనుకంజ వేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో చిన్న మొత్తం పెట్టుబడులతో అధిక లాభాలుంటే బాగుంటుందని అనుకుంటారు. ఇలాంటివాటికి పోస్టాఫీసులు అద్భుత పరిష్కారం. ప్రధాని నరేంద్ర మోదీ సైతం లైఫ్ ఇన్సూరెన్స్ , నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో పెట్టుబడి పెట్టారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రధాని పెట్టిన పెట్టుబడి వివరాలు
జూన్ 2020లో ప్రధాని నరేంద్ర మోదీ..నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో 8 లక్షల 43 వేల 124 రూపాయలు పెట్టుబడి పెట్టారు. లైఫ్ ఇన్సూరెన్స్‌లో 1 లక్షా 50 వేల 957 రూపాయలు ప్రీమియం చెల్లించారు.
జీరో రిస్క్‌తో పెట్టుబడి ప్రారంభించాలనుకుంటే పోస్టాఫీసులో పెట్టుబడి అత్యుత్తమ మార్గం. సురక్షితమైన ప్రభుత్వ పథకాలున్నాయి. ముఖ్యంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో పెట్టుబడి మంచి పద్ధతి. ఇది సురక్షితమైందే కాకుండా రిటర్న్ గ్యారంటీ కలిగి ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో ఐదేళ్లకు కనీస లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఐదేళ్ల వరకూ తీయడానికి ఉండదు. ఎన్‌ఎస్‌సిలో మూడు రకాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. సింగిల్ టైప్, జాయింట్ ఎ టైప్, జాయింట్ బి టైప్. సింగిల్ విధానంలో మీరు స్వయంగా లేదా మైనర్ కోసం పెట్టుబడి పెట్టవచ్చు. ఇక జాయింట్ ఎ విధానంలో ఎవరైనా ఇద్దరు కలిసి తీసుకోవచ్చు. జాయింట్ బి టైప్ విధానంలో కూడా ఇద్దరు కలిసి పెట్టుబడి పెడతారు కానీ మెచ్యూరిటీ అయిన తరువాత డబ్బులు ఏ ఒక్కరికోనో ఇస్తారు.
ఈ పోస్టాఫీసు పథకంపై ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ ఉంది. ఈ పథకంలో మీరు కనీసం వేయి రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. వంద రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై గరిష్ట పరిమితి లేదు. ఎన్‌ఎస్‌సిలో పెట్టుబడిపై సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ప్రతియేటా 1.5 లక్షల రూపాయలవరకూ పెట్టుబడిపై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook