PhonePe transaction charges: ఫోన్ పే యూజర్స్‌కి షాక్.. మొబైల్ రీచార్జీపై ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు

PhonePe transaction fees on mobile recharges: ఫోన్ పే బిజినెస్‌లో ప్రయోగంలో భాగంగా మొబైల్ రీఛార్జ్‌లపై (Mobile recharges on PhonePe) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నామని ప్రకటించిన ఫోన్ పే.. మెజారిటీ వినియోగదారులు ఏమీ చెల్లించరని.., లేదంటే ఒక్క రూపాయి మాత్రమే చెల్లించే పరిస్థితి ఉంటుంది " అని స్పష్టంచేసింది.

Last Updated : Oct 26, 2021, 05:19 AM IST
PhonePe transaction charges: ఫోన్ పే యూజర్స్‌కి షాక్.. మొబైల్ రీచార్జీపై ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు

PhonePe transaction fees on mobile recharges: ఫేమస్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీల్లో ఒకటైన ఫోన్‌పే తమ యూజర్స్‌కి షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు యూపీఐ సేవలను అన్ని కంపెనీల తరహాలోనే ఉచితంగా అందించిన ఫోన్ పే తాజాగా పలు ట్రాన్సాక్షన్స్‌పై ట్రాన్సాక్షన్ ఫీజు (Transaction Fees) పేరుతో చార్జీల మోత మోగించేందుకు రెడీ అయ్యింది. రెడీ అవడమే కాదు.. ప్రయోగాత్మకంగా రూ.50కి కంటే అధిక విలువ కలిగిన రీఛార్జీలపై ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక రూపాయి వసూలు చేస్తోంది. అలాగే రూ.100కి పైబడిన రీఛార్జీలపై ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ. 2 తీసుకుంటోంది. 

ఫోన్ పే బిజినెస్‌లో ప్రయోగంలో భాగంగా మొబైల్ రీఛార్జ్‌లపై (Mobile recharges on PhonePe) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నామని ప్రకటించిన ఫోన్ పే.. మెజారిటీ వినియోగదారులు ఏమీ చెల్లించరని.., లేదంటే ఒక్క రూపాయి మాత్రమే చెల్లించే పరిస్థితి ఉంటుంది " అని స్పష్టంచేసింది. ఇలా డిజిటల్ పేమెంట్ వాలెట్స్ ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేయడం ఇదేం మొదటిసారి కాదని చెప్పిన కంపెనీ.. బిల్లింగ్ వెబ్‌సైట్స్, ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌లు (Online payments) బిల్ చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి ఎప్పటి నుంచో ఎంతో కొంత నామమాత్రపు ఫీజును వసూలు చేస్తున్నాయని ఫోన్‌పే స్పష్టంచేసింది. 

ఇదిలావుంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిబంధనల ప్రకారం ఏ యూపీఐ యాప్స్ కూడా మార్కెట్ వాటాలో 30 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉండకూడదు. అయితే సెప్టెంబర్‌ నెలలో ఫోన్ పే 165 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలను (UPI transactions) నమోదు చేసింది. యాప్ సెగ్మెంట్‌లో ఇది 40 శాతానికి పైగా సమానం. అంటే విధించిన పరిమితి కంటే కూడా మరో 10 శాతానికిపైగా లావాదేవీలు జరిగాయన్నమాట. 

ఈ కారణంగానే ఫోన్ పే తాజాగా ప్రయోగాత్మకంగా ఇలా ఛార్జీలు విధించే నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఫోన్ పే తీసుకున్న ఈ నిర్ణయంతో ఫోన్ పే యూజర్స్ (PhonePe users) కొంతమంది వెనక్కి తగ్గినా.. కంపెనీకి వచ్చే నష్టం పెద్దగా ఉండదనేది ఫోన్ పే ఆలోచన అయ్యుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Trending News