Fuel Price Hike: వాహనదారులకు షాక్​.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

Fuel Price Hike: రెండు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ఏమిటంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 07:37 PM IST
  • పెట్రోల్, డీజిల్ ధరల పెరిగే అవకాశం
  • అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో వృద్ధే కారణం
  • గత రెండు నెలుగా దేశంలో స్థిరంగా ఇంధన ధరలు
Fuel Price Hike: వాహనదారులకు షాక్​.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

Fuel Price Hike: వాహనదారులకు షాకింగ్ న్యూస్​. త్వరలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel price hiked) పెరగనున్నట్లు తెలుస్తోంది.

బ్రెంట్​ క్రూడ్​ ఆయిల్ ధరలు గడిచిన నాలుగు వారాల్లో 25 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్ఠాన్ని తాకాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 87.99 డాలర్ల (Brent Curde price today) వద్ద ఉంది. దీనితో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరిగే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గత ఏడాది నవంబర్​ వరకు వరుసగా పెరుగతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు దీపావళి తర్వాత తగ్గుముఖం పట్టాయి. దీపావళి కానుకగా..  పెట్రోల్‌, డీజిల్‌లపై (petrol, diesel ) ఎక్సైజ్‌ సుంకం (Excise duty) తగ్గిస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇందుకు కారణం.

లీటర్ పెట్రోల్‌పై (Petrol Price cut) రూ.5లు, లీటర్ డీజిల్‌పై (Diesel Price cu) రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు తెలిపింది కేంద్రం. ఆ తర్వాత పలు రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. ఆ తర్వాత పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

హైదరాబాద్​లో పెట్రోల్ (Petrol price in Hyderabad) ధర రూ.108.18 వధ్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Hyderabad) రూ.94.61 వద్ద ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర (Petrol Price in Delhi) రూ.95.45 వద్ద ఉంది. డీజిల్ (Diesel Price in Delhi) ధర రూ.86.71 వద్ద కొనసాగుతోంది.

Also read: Amazon Republic Day Sale 2022: నేడు అమెజాన్​ 'గ్రేట్ రిపబ్లిక్​డే సేల్​' ఆఖరి రోజు- ఐఫోన్లపై భారీ ఆఫర్లు!

Also read: Gold Price Today: బ్యాడ్ ‏న్యూస్: దేశంలో ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News