Fuel Prices Hiked Again: వరుసగా ఐదో రోజు పెట్రోల్​ ధర మోత.. హైదరాబాద్​లో రూ.105లకు పెరిగిన డీజిల్​ ధర

Fuel price Hiked: దేశంలో పెట్రోల్ ధరల మోత కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు ముడి చమురు ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 05:41 PM IST
    • దేశవ్యాప్తంగా ఆగని పెట్రో బాదుడు
    • ఆల్​టైంహైకి పెట్రోల్​, డీజిల్​ ధరలు
    • హైదరాబాద్​లో రూ.105కు చేరిన డీజిల్​ ధర
Fuel Prices Hiked Again: వరుసగా ఐదో రోజు పెట్రోల్​ ధర మోత.. హైదరాబాద్​లో రూ.105లకు పెరిగిన డీజిల్​ ధర

Fuel Prices Hiked Again: దేశం వ్యాప్తంగా పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు (ఆదివారం) పెట్రోల్‌, డీజిల్‌ రెండింటిపైనా లీటరుకు మరో 35 పైసల చొప్పున పెంచారు. ఈ పెంపుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.107.59, డీజిల్‌ రూ.96.32కి చేరింది.  

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ పెట్రోలు, డీజిల్​ ధరలు వరుసగా రూ.113.46, రూ.104.38గా ఉంది. ఒక్క కోల్‌కతా మినహా దాదాపు అన్ని రాష్ట్ర రాజధానుల్లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 మార్క్‌ను చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.105కి చేరింది.

గతేడాది మే 5 నుంచి.. అంటే దాదాపు 18 నెలల్లో లీటరు పెట్రలు పైన మొత్తం రూ.36, లీటరు డీజిలుపైన దాదాపు రూ.27 మేర పెంచారు. లీటరు పెట్రోల్‌పై రూ.32.9, డీజిలుపై రూ.31.8 చొప్పున కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడమే ఇంధన ధరల పెరుగుదలకు కారణం.  

ఆంధ్రప్రదేశ్​లోని ముఖ్య నగరాలైన విజయవాడలో లీటరు పెట్రోలు రూ.113.93, డీజిల్​ రూ.106.50 ఉండగా.. విశాఖపట్నంలో రూ.113.23, డీజిల్​ రూ.105.80గా ధరలు ఉన్నాయి.

Also Read: Petrol Price Hiked: వరుసగా నాలుగో రోజూ పెట్రోల్ ధరల మోత- చెన్నైలో సెంచరీ కొట్టిన డీజిల్

Also Read: Matchbox Price: అగ్గిపెట్టె రూ.2.. డిసెంబరు 1 నుంచి అమలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

 

Trending News