Oppo A97 5G Price: రూ.23 వేలకే ఒప్పో కొత్త 5జీ ఫోన్.. సూపర్ స్పెసిఫికేషన్‌లు ఇవే!

OPPO A97 5G Smartphone launch in India soon. ఒప్పో ఏ97 5జీలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 298 డాలర్లు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 16, 2022, 02:12 PM IST
  • రూ.23 వేలకే ఒప్పో కొత్త 5జీ ఫోన్
  • సూపర్ స్పెసిఫికేషన్‌లు ఇవే
  • ప్రస్తుతానికి చైనాలో మాత్రమే
Oppo A97 5G Price: రూ.23 వేలకే ఒప్పో కొత్త 5జీ ఫోన్.. సూపర్ స్పెసిఫికేషన్‌లు ఇవే!

OPPO A97 5G Smartphone launch in India soon: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ 'ఒప్పో' ఎప్పటికపుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 'ఏ' సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో ఏ97 5జీ (Oppo A97 5G) స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో ఒప్పో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి ప్యాకేజీగా వచ్చింది. డిజైన్ నుంచి ఫీచర్ల వరకు అన్ని కూడా అత్యుత్తమంగా ఉన్నాయి. అంతేకాదు ధరలో కూడా సామాన్యులకు అందుబాటులో ఉంది. 

ఒప్పో ఏ97 5జీలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 298 డాలర్లు. భారత కరెన్సీలో ఈ ఫోన్ ధర సుమారు రూ. 23,657గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం బ్లాక్, బ్లూ రంగుల్లో మాత్రమే విడుదల అయింది. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. భారత దేశంలో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పుడనే వివరాలు తెలియరాలేదు. 

ఒప్పో ఏ97 5జీలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్‌ఫోన్‌ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.  12 జీబీ ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 256 వరకు పెంచుకోవచ్చు.

ఒప్పో ఏ97 5జీ ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా..  2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ లాంటి ఫిచర్స్ అందుబాటులో ఉన్నాయి. 

Also Read: Fuel Price: సామాన్య ప్రజలకు శుభవార్త.. పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.7 తగ్గింపు!

Also Read: Major: మేజర్ మూవీ అరుదైన రికార్డు.. శత్రుదేశం సహా 14 దేశాల్లో టాప్ మూవీగా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News