OnePlus Nord CE 2 5G: వన్​ప్లస్​ నార్డ్​ ఎస్​ఈ2 5జీ విక్రయాలు షురూ- ఆఫర్లు ఇవే..

OnePlus Nord CE 2 5G: నార్డ్​ సీఈ2 5జీ విక్రయాలు ప్రారంభించింది వన్​ప్లస్. ఈ ఫోన్లు ఎక్కడి విక్రయాలకు అందుబాటులో ఉంటాయి? ప్రారంభ సేల్ ఆఫర్లు ఎలా ఉన్నాయి? అనే పూర్తి వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 05:47 PM IST
  • కొత్త ఫోన్ విక్రయాలు ప్రారంభించిన వన్​ప్లస్​
  • నాల్డ్​ ఎస్​ఈ2 పేరుతో ఇటీవలే మార్కెట్లో లాంచ్​
  • ఆరంభ ఆఫర్​ కింద భారీ డిస్కౌంట్​
OnePlus Nord CE 2 5G: వన్​ప్లస్​ నార్డ్​ ఎస్​ఈ2 5జీ విక్రయాలు షురూ- ఆఫర్లు ఇవే..

OnePlus Nord CE 2 5G: దేశీయంగా ఇటీవల విడుదలైన వన్​ప్లస్​ నార్డ్​ సీఈ2 5జీ స్మార్ట్​ఫోన్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ ఫోన్లు విక్రయాలకు అందుబాటులో ఉన్నాయని వన్​ప్లస్​ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

ఎక్కడ కొనొచ్చు..

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 2 5జీ మొబైల్​ను వన్​ప్లస్​ వెబ్​సైట్​, వన్​ ప్లస్​ స్టోర్​ యాప్​, వన్​ ప్లస్​ ఎక్స్​పీరియన్స్ స్టోర్స్​ సహా అధికారిక డీలర్​షిప్​ పార్ట్​నర్స్ దగ్గర ఈ ఫోన్ విక్రయాలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

ఆఫర్లు ఇలా..

ఫస్ట్ సేల్ సందర్భంగా వన్​ప్లస్​ నార్డ్​ సీఈ2 5జీ ఫోన్​ను కొనే వారికి.. ప్రత్యేక ఆఫర్లు ఇచ్చింది కంపెనీ. ఈ ఫోన్​తో పాటు రూ.699కి వన్​ ప్లస్ బ్యాండ్​, రూ.999కి వన్​ ప్లస్​ బుల్లెట్స్​ వైర్​లెస్​ జెడ్​ బాస్​ ఎడిషన్​ను సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్​ వన్​ ప్లస్​ స్టోర్​ యాప్​లో తొలి 24 గంటల సమయంలో కొనుగోలు చేసిన వారికి మాత్రమే లభిస్తుందని స్పష్టం చేసింది కంపెనీ.

పాత ఆండ్రాయిడ్​ ఫోన్​ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.3 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 22-28 వరకు అందుబాటులో ఉండనుంది. అన్ని ప్లాట్​ఫామ్స్​పై ఈ ఆఫర్​ను వినియోగించుకోవచ్చు.

వీటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్​ కార్డ్ కొనుగోళ్లు జరిపే వారికి రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ2 5జీ ఫీచర్లు, ధర..

  • 6.43 అంగుళాల డిస్​ప్లే ఆమోల్డ్​, 90హెచ్​జెడ్​ రిఫ్రేష్​ రేట్​, ఇన్​డిస్​ప్లే ఫింగర్​ప్రిట్​ స్కానర్​, గొరిల్లా గ్లాస్​ 5, హెచ్​డీఆర్​ 10+ సర్టిఫికెట్​
  • రెండు రకాల వేరియంట్లలో లభిస్తుంది.
  • 6 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​ ధర రూ.23,999
  • 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​ ధర రూ.25,999
  • డైమెన్సిటీ 900 ప్రాసెసర్​
  • ట్రిపుల్ రియర్ కెమెరా (65 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ ఆల్ట్రావైడ్​ కెమెరా, 2 ఎంపీ మైక్రో లెన్స్​)
  • 16 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా (పంచ్​ హోల్​)
  • 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
  • ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​

ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్​తో లభిస్తుంది. ఒకటి గ్రే మిర్రర్, రెండోది బహామ బ్లూ కలర్​.

Also read: Stocks today: స్టాక్ మార్కెట్లను వీడని రష్యా-ఉక్రెయిన్​ భయాలు- ఐదో రోజు తప్పని నష్టాలు!

Also read: Special Festival Advance Scheme: ఆ ఉద్యోగులకు రూ.10 వేలు పండుగ అడ్వాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News