Ola S1 Exchange Offer: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా బైక్‌లకు మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజుల నుంచి టాప్ సేలింగ్ ఎలక్ట్రిక్ బైక్‌ల లిస్ట్‌ల్లో ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో స్కూటర్స్ ఉంటున్న విషయం తెలిసిందే. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్‌ను మరింత ఆకర్శించేందుకు ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని బైక్‌లపై అదనంగా ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. అయితే ఈ ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రోలను ఎక్చేంజ్ ఆఫర్లలో ఎలా కొనుగోలు చేయాలో..ఈ బైక్‌కు ఆఫర్లకు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఓలా కంపెనీ ప్రవేశపెట్టిన ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా మీ పాత బైక్‌ని ఎక్చేంజ్ చేసి కొత్త ఓలా బైక్‌ను పొందడానికి త్రీ స్టెప్స్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా మీ దగ్గరలో ఉన్న ఓలా సెంటర్‌ని సందర్శించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓలా అధికారులు మీ పెట్రోల్ బైక్‌ను తనిఖీ చేస్తారు. ఇలా చేసిన తర్వాత మీ పాత బైక్ వ్యాల్యూను కొటేషన్ రూపంలో అందిస్తారు. ఆ తర్వాత మీరు ఎంచుకున్న కలర్ ఓలా S1 బైక్‌పై పాత బైక్ ఎక్చేంజ్ బోనస్‌ను తగ్గిస్తారు. అంటే మీ పాత బైక్ ధరను కొత్త బైక్ ధరలో మైనస్ చేస్తారు. అంతేకాకుండా కంపెనీ అదనంగా రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ఈ బోనస్‌కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న ఓలా షో రూమ్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
45,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్!
గతంలో ఓలా కంపెనీ ఎక్చేంజ్ ఆఫర్స్‌కి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రకటనలో భాగంగా ఇప్పటికే ఉన్న పెట్రోల్ ద్విచక్ర వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకునే వారు రూ.45,000 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో పాటు..అదనంగా రూ.5,000 వరకు ఎక్చేంజ్ బోనస్‌ను అందిచబోతున్నట్లు పేర్కొంది. దీంతో అన్ని ఎక్చేంచ్ ఆఫర్స్ పోను ఈ ఎలక్ట్రిక్ బైక్‌పై రూ. 50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఓలా త్వరలోనే అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదగబోతోందని సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. అన్ని దేశాల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
Ola S1 ధర, స్పెక్స్:
ప్రస్తుతం కంపెనీ Ola S1ను రూ.99,999లకు విక్రయిస్తోంది. ఈ బైక్ 3.6 సెకన్లలో 0 నుంచి 40 kmph వరకు వేగవంతంతో గమ్యస్థానానికి చేరుకుంటుంది. గరిష్టంగా 90 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది. Ola S1 స్కూటర్ 8.5 kW గరిష్ట శక్తితో 121 కిమీల డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంటుంది. ఓలా s వేరియట్‌లు 3.92 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి