Ola Electric: ఓలా కీలక నిర్ణయం.. 1441 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వెనక్కి!

Ola Electric to Recall over 1400 electric scooters. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' కీలక నిర్ణయం తీసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 03:01 PM IST
  • ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అగ్ని ప్రమాదం
  • ఓలా కీలక నిర్ణయం
  • 1441 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వెనక్కి
Ola Electric: ఓలా కీలక నిర్ణయం.. 1441 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వెనక్కి!

Ola Electric to Recall 1441 Scooters Amid Rise In EV Fire Incidents: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' కీలక నిర్ణయం తీసుకుంది. 1441 యూనిట్ల ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వాహనాలను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తున్నట్లు తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. పుణెలో ఇటీవల జరిగిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఐతే దీనిపై ఇంకా పూర్తిస్థాయి సమీక్ష కొనసాగుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.

మార్చి 26న పుణెలో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అగ్ని ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. అంతకుముందు బ్యాటరీల్లో మంటలు చెలరేగి కొంతమంది చనిపోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తానికి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలోనే ఓలా ఎలక్ట్రిక్‌.. తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను వెనక్కి పిలిచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1441 యూనిట్ల ఒలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను వెనక్కి పిలుస్తోంది. 

'ముందస్తు చర్యగా ప్రమాదానికి గురైన స్కూటర్‌తో పాటు ఆ బ్యాచ్‌లో తయారైన అన్నింటినీ తనిఖీ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగానే 1441 ద్విచక్రవాహనాలను రీకాల్‌ చేస్తున్నాం.  బ్యాటరీ వ్యవస్థలు, థర్మల్‌ వ్యవస్థలపై మా సర్వీస్‌ ఇంజినీర్లు పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. మా ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో అమర్చిన బ్యాటరీలు భారత ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు (ECE 136) కూడా సరిపోతాయి' అని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. 

పుణెలో జరిగిన ప్రమాద ఘటనపై ఇంకా పూర్తిస్థాయి సమీక్ష కొనసాగుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఇటీవలే ఒకినవ ఆటోటెక్‌ కూడా 3000 యూనిట్ల ఈవీలను రీకాల్‌ చేసింది. ప్రమాద ఘటనలను పరిశీలించడానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోందని సమాచారం. నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే కంపెనీలకు జరిమానాలు విధించే అవకాశం ఉందట. 

Also Read: నా సతీమణి నీకు పెద్ద ఫ్యాన్.. నిన్ను ప్రేమిస్తుంది! పూజా హెగ్డేపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

Also Read: Michael Vaughan: ముంబై ప్లేఆఫ్‌కు చేరకపోతే...రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడం మంచిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News