Ola scooters: ఇ-కామర్స్ చరిత్రలో 'ఓలా' సరికొత్త రికార్డు...రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు అమ్మకాలు..

Ola scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా సంస్థ రికార్డు సృష్టించింది.  రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు  అమ్మి..ఇ-కామర్స్ చరిత్రలో సంచలనం నమోదు చేసింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2021, 03:02 PM IST
  • రెండు రోజుల్లో రూ. 1100 కోట్ల విక్రయాలు
  • భారతీయ ఇ-కామర్స్ చరిత్రలో ఇది ఘనమైన రికార్డు
  • వెల్లడించిన ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌
Ola scooters: ఇ-కామర్స్ చరిత్రలో 'ఓలా' సరికొత్త రికార్డు...రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు అమ్మకాలు..

Ola scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లో రూ. 1100 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసి..రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని కంపెనీ  ఓలా గ్రూప్ సీఈఓ భవీష్‌ అగర్వాల్(Bhavish Aggarwal) ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. తొలి రోజు సేల్స్‌(Sales)ను మించి రెండో రోజు అమ్మకాలతో తమ రికార్డును తామే అధిగమించామంటూ ట్వీట్‌ చేశారు.

ఇ-కామర్స్ చరిత్రలో రికార్డు
ఆన్‌లైన్‌లో బుధవారం ఉదయం ఓలా స్కూటర్ల(Ola scooters) విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలి 24 గంటల్లో సెకనుకు 4 స్కూటర్ల చొప్పున రూ.600 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయి. రెండో రోజు నాటికి ఆ విక్రయాలు రూ.11,00 కోట్ల విలువకు చేరుకున్నాయి. భారతీయ ఇ-కామర్స్(E commerce) చరిత్రలో ఇది ఘనమైన రికార్డు. 48 గంటల సేల్‌ నిన్నటితో (సెప్టెంబరు 16) ముగిసింది. అయితే కస్టమర్లు స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో రూ. 20వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. తదుపరి సేల్‌ దీపావళి(Diwali) సందర్బంగా నవంబర్ 1 నిర్వహించనుంది. కేవలం రూ. 499 వద్ద ఆన్‌లైన్‌లో ప్లాట్‌ రిజర్వ్ చేసుకోవచ్చు.  అయితే  ప్రస్తుతం కొనుగోలు విండోను క్లోజ్‌ చేసినా,  రిజర్వేషన్లు olaelectric.com  ఓపెన్‌లో ఉంటుందని ఓలా సీఈఓ తెలిపారు. ఏడాదికి 10 లక్షల స్కూటర్లను తయారు చేసే సామర్థ్యంతో ప్లాంటును సంస్థ తమిళనాడులో నిర్మిస్తోంది.

Also Read: Ola electric scooter sale: ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అమ్మ‌కాలు ప్రారంభం.. రూ. 499తో స్కూట‌ర్‌ని రిజర్వ్ చేసుకునే అవకాశం, సబ్సిడీ వల్ల ధరలో భారీ వ్యత్యాసం

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు
ఓలా ఎస్ 1 ధర 1 లక్ష రూపాయలు, ఎస్ 1 ప్రో ధర రూ. 1.30 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అంతేకాదు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్  వాహనాల(Electric Vehicles)పై రాష్ట్ర సబ్సిడీలను బట్టి డెలివరీ సమయంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎస్‌ 1 గరిష్ట వేగం  గంటలకు 90 కి.మీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిమీ వరకు ఉంటుంది.  ఎస్‌ 1 ప్రో గరిష్ట వేగం  181- 115 కి.మీ.ల మధ్య ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News