NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

NEET 2024 Key & Cutoff Marks: దేశవ్యాప్తంగా మే 5న జరిగిన నీట్ 2024 తుది ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. నీట్ 2024 కీతో పాటు రిజర్వేషన్ కేటగరీ ఆధారంగా కటాఫ్ మార్కులు కూడా ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 30, 2024, 12:47 PM IST
NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

NEET 2024 Key & Cutoff Marks: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే NEET UG 2024 పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. కీ, కటాఫ్ మార్కుల వివరాలు అధికారిక వెబ్‌సైట్లు exams.nta.ac.in/NEET , neet.ntaonline.in ద్వారా తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ. ఈ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 31 అంటే రేపు రాత్రిలోగా నమోదు చేయవచ్చు. అయితే ఎన్ని ప్రశ్నలపై అభ్యంతరాలుంటే అన్ని 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కీపై తుది అభ్యంతరాలకు ఇదే చివరి అవకాశం. అభ్యంతరాలుంటే neet.ntaonline.in ఓపెన్ చేసి దాఖలు చేయాల్సి ఉంటుంది. నీట్ ర్యాంకింగ్ ఆధారంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సుల్లో ప్రవేశముంటుంది. గతం కంటే ఈసారి నీట్ పరీక్షలు 2 లక్షలు అధికంగా హాజరయ్యారు. ఈసారి మొత్తం 22 లక్షలమంది నీట్ పరీక్షకు హాజరయ్యారు.

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందికి సమాన మార్కులు వస్తే బయాలజీ మార్కుల ఆధారంగా ర్యాంక్ నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యతలో బయాలజీ మార్కులు చూస్తారు. అందులో కూడా సమానంగా వస్తే రెండవ ప్రాధాన్యతగా కెమిస్ట్రీ మార్కులు పరిగణలో తీసుకుంటారు. అందులో కూడా సమానమైతే మూడో ప్రాధాన్యతలో ఫిజిక్స్ మార్కులు చూస్తారు. 

నీట్ 2024 కటాఫ్ మార్కులు

జనరల్ కేటగరీ విద్యార్ధులకు    50 పర్సంటైల్  715-117
జనరల్ పీహెచ్ కేటగరీ             45 పర్సెంటైల్  116-105
ఎస్టీ పీహెచ్ కేటగరీ                   40 పర్సెంటైల్  104-93
ఎస్టీ పీహెచ్ కేటగరీ                   40 పర్సంటైల్  104-93
ఓబీసీ పీహెచ్ కేటగరీ               40 పర్సంటైల్   104-93
ఎస్సి కేటగరీ విద్యార్ధులకు       40 పర్సంటైల్   116-93
ఎస్టీ కేటగరీ విద్యార్ధులు            40 పర్సంటైల్   116-93
ఓబీసీ కేటగరీ విద్యార్ధులకు      40 పర్సంటైల్   116-93

Also read: 7th Phase Lok Sabha Polls 2024: నేటితో ముగియననున్న చివరి దశ ఎన్నికల ప్రచారం.. జూన్ 1 పోలింగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News