NPS Pension: రిటైర్మెంట్ తరువాత నెలకు 2 లక్షల పెన్షన్, ఇలా చేస్తే చాలు

NPS Pension: రిటైర్‌మెంట్ అనంతరం భవిష్యత్ సంరక్షణకు నెలకు 2 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకునే అద్భుతమైన పథకమిది. ఆ పథకం వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 4, 2022, 06:18 PM IST
NPS Pension: రిటైర్మెంట్ తరువాత నెలకు 2 లక్షల పెన్షన్, ఇలా చేస్తే చాలు

క్రమం తప్పకుండా పెట్టుబడి, సరైన ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఎంచుకుంటే కోటీశ్వరులు కావడం పెద్ద కష్టమేం కాదు. వృద్ధాప్యం భారం కాకుండా..మరొకరిపై ఆధారపడకుండా..హాయిగా జీవించేందుకు కొన్ని సురక్షితమైన సేవింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పట్నించి ఆ పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ చేస్తే మీరు రిటైర్ అయిన తరువాత అద్భుతమైన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో చేరిన తరువాత సేవింగ్స్ ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచి ఫలితాలుంటాయి. రిటైర్‌మెంట్ ఫండ్ కోసం చాలా పథకాలున్నాయి. అందులో కొన్ని ఈపీఎఫ్, ఎన్‌పీ‌ఎస్, షేర్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ రంగం వంటివి ఉన్నాయి.

మీ భవిష్యత్ సురక్షితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది. మీరు ఉద్యోగస్థులైతే..రిటైర్ అయిన తరువాత ప్రతి నెల భారీగా పెన్షన్ తీసుకునేలా ఇప్పట్నించే ప్లాన్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఇప్పట్నించే పెట్టుబడి అవసరం. తద్వారా 60 ఏళ్ల తరువాత వృద్ధాప్యాన్ని సెక్యూర్ చేసుకోవచ్చు.

ఎన్‌పీఎస్ పథకం అంటే

నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఓ ప్రభుత్వ పెన్షన్ పథకం. ఇందులో ఈక్విటీ, డెబ్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రెండూ ఉన్నాయి. ఎన్‌పీఎస్‌కు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తుంది. రిటైర్‌మెంట్ తరువాత నెలనెలా పెన్షన్ కోసం ఇది మంచి పథకం.

ఎన్‌పీఎస్ పథకం అనేది పీపీఎఫ్, ఈపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన లాంటి ప్రభుత్వ పథకం. ఇందులో ఎవరైనా సరే పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ ఎమౌంట్‌ను సరిగా వినియోగించుకుంటే నెలవారీ పెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎన్‌పీఎస్ ద్వారా మీరు ఏడాదికి 2 లక్షల రూపాయల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఇన్‌కం‌ట్యాక్స్ సెక్షన్ 80 సి ప్రకారం అత్యధికంగా 1.5 లక్షల రూపాయలవరకూ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెడితే..మీకు 50 వేల రూపాయలవరకూ అదనంగా ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. 

నెలకు 2 లక్షల పెన్షన్ ఎలా

ఎన్‌పీఎస్‌లో 40 ఏళ్ల వరకూ ప్రతి నెలా 5 వేలు రూపాయలు జమ చేస్తుంటే 1.91 కోట్లు అందుతాయి. ఆ తరువాత మెచ్యురిటీ ఎమౌంట్ పెట్టుబడిపై నెలకు 2 లక్షల రూపాయలు పెన్షన్ లభిస్తుంది. దీని ప్రకారం మీరు సిస్టమెటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌తో 1.43 లక్షల రూపాయలు, 63,768 రూపాయలు నెలవారీ రిటర్న్ తీసుకోవచ్చు. ఇందులో ఇన్వెస్టర్ బతికున్నంతవరకూ నెలకు 63,768 రూపాయలు పెన్షన్ లభిస్తుంది. 

ఒకవేళ మీరు 20 ఏళ్ల నుంచి రిటైర్‌మెంట్ వరకూ ప్రతి నెలా 5000 రూపాయలు పెట్టుబడి పెడుతుంటే..1.91 కోట్ల నుంచి 1.27 కోట్ల వరకూ మెచ్యూరిటీ ఎమౌంట్ లభిస్తుంది. దీనిపై 6 శాతం రిటర్న్‌తో 1.27 కోట్ల రూపాయలపై ప్రతి నెలా 63,768 రూపాయలు పెన్షన్ వస్తుది.

ఎన్‌పీఎస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఎన్‌పీఎస్ టైర్ 1, ఎన్‌పీఎస్ టైర్ 2. టైన్ 1లో కనీస పెట్టుబడి 500 రూపాయలు కాగా టైర్ 2లో 1000 రూపాయలుంది. ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడికి మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. మీ డబ్బు ఎక్కడ పెట్టుబడిగా పెడతారనేది తెలుసుకోవాలి. ఈక్విటీ, కార్పొరేట్ డేట్, ప్రభుత్వ బాండ్లలో ఎందులో పెడతారో పరిశీలించాలి. ఈక్వీటీలో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. 

Also read; Railway General Ticket: రైల్వే టికెట్ కోసం క్యూ అవసరం లేదిక, ఆన్‌లైన్‌లోనే జనరల్ టికెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News