Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?

Namo Bharat Ticket Price: ఢిల్లీ-మీరట్ కారిడార్‌ల మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైలు పరుగులు పెడుతోంది. అత్యంత వేగంగా గమ్యస్థానాన్ని చేరే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ప్రయాణికులు ర్యాపిడ్ రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. ఈ రైలు పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2023, 10:26 AM IST
Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?

Namo Bharat Ticket Price: అత్యాధునిక వసతులతో అత్యధిక వేగంగా నడిచే 'నమో భారత్‌' రైలు పట్టాలెక్కింది. ప్రస్తుతం పట్టాలపై పరుగులు పెడుతున్న ర్యాపిడ్‌ రైలుకు ప్రయాణికుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ర్యాపిడ్ రైలు ద్వారా ఇంటర్‌సిటీ ప్రయాణం చేసే వ్యక్తులు చాలా ఉపశమనం పొందుతున్నారు. తక్కువ సమయంలో ఒక సిటీ నుంచి మరో సిటీకి చేరుకునే అవకాశం ఉంటుంది. ర్యాపిడ్ రైలు మొదటి విడతగా కింద ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో ప్రయాణిస్తోంది. ఈ ర్యాపిడ్ రైలు టిక్కెట్ ధర ఎంత..? వేగం ఎంత..? వివరాలు ఇలా.. 

ర్యాపిడ్ రైలులో స్టాండర్డ్ కోచ్‌కు రూ.20 నుంచి రూ.50 వరకు ఉంది. ప్రీమియం కోచ్‌కు రూ.40 నుంచి రూ.100 వరకు ఉంది. ర్యాపిడ్ రైలు స్టేషన్‌లలో టిక్కెట్ వెండింగ్ మెషీన్‌లలో యూపీఐ చెల్లింపు ద్వారా టికెట్ పొందొచ్చు. దీంతో పాటు స్మార్ట్ కార్డ్, టాప్-అప్ వాలెట్, క్యూఆర్ ఆధారిత టిక్కెట్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం ర్యాపిడ్ రైలులో మొత్తం 6 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 4 స్టాండర్డ్ కోచ్‌లు ఉంటాయి. దీంతో పాటు ఒక కోచ్ మహిళలకు రిజర్వ్ చేశారు. ఒక ప్రీమియం కోచ్ ఉంటుంది. ఒక్కో రైలులో 1061 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఒక్కో రైలులో 407 సీట్లు ఉంటాయి. ఈ రైలు ప్రీమియం కోచ్‌లో వాలు సీటు, ఎక్స్‌ట్రా స్పేస్, ప్రత్యేక లాంజ్ సౌకర్యం కూడా ఉంటుంది.
 
ఈ రైలులో ప్రయాణికులకు ఫ్రీ వైఫై అందుబాటులో ఉంటుంది. ప్రతి సీటుకు ఛార్జింగ్ పాయింట్ సౌకర్యం ఉంటుంది. డైనమిక్ రూట్ మ్యాప్ డిస్‌ప్లే అవుతుంటుంది. వీల్‌చైర్లు వాడే వ్యక్తుల కోసం ప్రత్యేక స్థలం ఉంటుంది. ఎమర్జెన్సీ అలరం వ్యవస్థ కూడా ఉంటుంది. దీని ద్వారా ప్రయాణికులు నేరుగా ఇంటర్‌కామ్ ద్వారా డ్రైవర్‌తో మాట్లాడవచ్చు. నమో భారత్ గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు ఉంది. అక్టోబరు 21 నుంచి నమో భారత్ ప్రయాణం మొదలు పెట్టింది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 15 నిమిషాల వ్యవధిలో ఒక సర్వీసులో అందుబాటులో ఉంటుంది.

Also Read:  Kalyan Ram Devil : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి

Also Read: Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook

Trending News