Jio Happy New Year 2023 Plan: రిలయన్స్ జియో కస్టమర్స్‌కి గుడ్ న్యూస్.. రోజుకు 2.5GB డేటా

Jio Happy New Year 2023 Plan: రిలయన్స్ జియో ప్రకటించిన హ్యాపీ న్యూ ఇయర్ 2023 రీచార్జ్ ప్లాన్ ఆఫర్ ప్రకారం రోజుకు 2.5GB డేటా చొప్పున మొత్తం 252 రోజులకుగాను 630GB ఇంటర్నెట్ డేటా లభిస్తుందన్నమాట.  అంతేకాకుండా జియో అప్లికేషన్స్‌కి యాక్సెస్‌తో పాటు కొత్త కస్టమర్స్‌కి అమేజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా లభించనుంది. 

Written by - Pavan | Last Updated : Dec 23, 2022, 05:52 PM IST
  • జియో సబ్‌స్క్రైబర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన రిలయన్స్ జియో
  • 252 రోజుల పాటు వ్యాలిడిటీతో అద్దిరిపోయే డేటా ప్యాకేజ్
  • హై స్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎంటర్‌టైన్మెంట్
Jio Happy New Year 2023 Plan: రిలయన్స్ జియో కస్టమర్స్‌కి గుడ్ న్యూస్.. రోజుకు 2.5GB డేటా

Jio Happy New Year 2023 Plan: రిలయన్స్ జియో కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా తమ జియో సబ్‌స్క్రైబర్స్ కోసం రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్ ప్రకటించింది. రిలయన్స్ జియో ఈ హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్‌తో ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు జియో యాప్ బెనిఫిట్స్ అందిస్తోంది. రిలయన్స్ జియో ప్రకటించిన వివరాల ప్రకారం ఈ సరికొత్త ప్లాన్‌తో జియో కస్టమర్స్‌కి 9 నెలలు పాటు నిత్యం 2.5GB డేటా లభించనుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. 

టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న రూల్స్ ప్రకారం ఒక నెలకు 28 రోజులు మంత్లీ సైకిల్‌గా ఉండనుంది. అంటే 9 నెలలకుగాను 252 రోజులు వ్యాలిడిటీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రోజుకు 2.5GB డేటా చొప్పున మొత్తం 252 రోజులకుగాను 630GB ఇంటర్నెట్ డేటా లభిస్తుందన్నమాట.

252 రోజుల పాటు రోజుకు 100 మెసేజులు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. 

జియో అప్లికేషన్స్‌కి యాక్సెస్‌తో పాటు కొత్త కస్టమర్స్‌కి అమేజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా లభించనుంది. 

హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్‌తో లభించే ఇంటర్నెడ్ డేటా పూర్తయినట్టయితే, ఆ తరువాత జియో యూజర్స్ కి 64Kbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఇది అంతకంటే ముందు వచ్చిన డేటా స్పీడ్ కంటే చాలా స్లోగా ఉంటుంది.

కొత్త సంవత్సరం సందర్భంగా ప్రవేశపెడుతున్న హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్ పరిమిత కాలపు ఆఫర్ మాత్రమే. ఈ ప్లాన్‌ని రిలయన్స్ జియో ఏ క్షణమైనా నిలిపేయవచ్చు. 

జియో.కామ్, మై జియో యాప్‌తో పాటు గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ పై సైతం ఈ హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Metro and Reliance Deal: మెట్రో ఇండియాను భారీ డీల్‌‌తో చేజిక్కించుకున్న రిలయన్స్, డీల్ వివరాలు ఇవీ

ఇది కూడా చదవండి : RDE Norms in New Cars: ఈ కార్లను కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్

ఇది కూడా చదవండి : SBI Credit Card New Rules: 2023 జనవరి నుండి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కొత్త రూల్స్.. ఖర్చు విషయంలో జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News