Mutual Funds: వాట్సప్ నుంచి కూడా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా

Mutual Funds: చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొద్దిగా రిస్క్ తీసుకునేట్టయితే అధిక లాభాలు ఆర్జించేందుకు మ్యూచ్యువల్ ఫండ్స్ మంచి మార్గమనే చెప్పవచ్చు. అయితే మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది అందరికీ తెలియదు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 26, 2024, 09:53 PM IST
Mutual Funds: వాట్సప్ నుంచి కూడా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా

Mutual Funds: మ్యూచ్యువల్ ఫండ్స్ గురించి కొద్దో గొప్పో తెలిసినవాళ్లు అందులో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నా ఎలా చేయాలి, ఏం చేయాలో తెలియక అసహనానికి గురవుతుంటారు. అయితే సోషల్ మీడియా ప్రాచుర్యం పెరిగాక ఇది సులభమైపోయింది. వాట్పప్ నుంచి కూడా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 

మ్యూచ్యువల్ ఫండ్స్ కంపెనీలు కూడా అందుకే సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా వాట్సప్ ద్వారా మ్యూచ్యువల్ ఫండ్స్ గురించి అవగాహన కల్పించడమే కాకుండా ఎలా పెట్టుబడి పెట్టాలో కూడా చూపిస్తున్నాయి. ఎక్కౌంట్ స్టేట్‌మెంట్స్, లావాదేవీలు అన్నీ వాట్సప్ ద్వారా నిర్వహించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు వాట్సప్ ద్వారా మారే అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్ధికేతర సేవలైన నామినీ వివరాలు, కాంటాక్ట్ వివరాలు, ఎక్కౌంట్ స్టేట్‌మెంట్స్ అన్నీ వాట్సప్ ద్వారానే సాధ్యమౌతుంది. 

హెచ్‌డిఎఫ్‌సి మ్యూచ్యువల్ ఫండ్, ఆదిత్య బిర్లా, సన్‌లైఫ్ మ్యూచ్యువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచ్యువల్ ఫండ్, మోతీలాల్ ఓశ్వాల్ మ్యూచ్యువల్ ఫండ్ సేవల్ని వాట్సప్ ద్వారా పొందవచ్చు.  WhatsApp Bot అనేది మ్యూచ్యువల్ ఫండ్ వెబ్‌సైట్‌కు లింక్ చేసేందుకు దోహదం చేస్తుంది. దీనికోసం ముందుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 

మ్యూచ్యువల్ ఫండ్ హౌస్ నెంబర్ ముందుగా మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వాట్సప్‌లో ఆ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పంపించాలి. ఏమైనా సందేహాలుంటే వాట్సప్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ కంపెనీల మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే సీఎంఎస్ వాట్సప్ సర్వీసెస్ వినియోగించాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మ్యూచ్యువల్ ఫండ్స్ గురించి వివరంగా తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్, నిపుణుల సలహా తీసుకోవాలి. మ్యూచ్యువల్ ఫండ్స్ అనేది మార్కెట్ పరిస్థితికి అనుగుణంగా ఉంటుంది. 

Also read: NSC Benefits: ఈ పధకంలో ఇన్వెస్ట్ చేస్తే 7.7 శాతం వడ్డీతో పాటు ట్యాక్స్ మినహాయింపు కూడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News