Mumbai Google Office Bomb Threat Call: టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందంటూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేయడం కలకలం రేపింది. ముంబైలోని గూగుల్ కార్యాలయానికి సోమవారం ఫోన్ చేసి.. పూణేలోని గూగుల్ కార్యాలయంలో బాంబు పెట్టినట్లు చెప్పాడు. గూగుల్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పుణె పోలీసులతో పాటు ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు. పూణే ఆఫీస్ ప్రాంగణాన్ని పరిశీలించి.. ఫేక్ కాల్‌గా గుర్తించారు. ఈ బెదిరింపు కాల్ హైదరాబాద్ నుంచి వచ్చినట్లు తేల్చారు.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సులో గూగుల్ కార్యాలయం ఉంది. ఈ ఆఫీస్‌కు ఆదివారం సాయంత్రం 7.54 నిమిషాలకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు పనయం శివానంద్ అని పరిచయం చేసుకున్నాడు. తాను హైదరాబాద్‌లో ఉంటున్నానని.. పుణెలోని ముంధ్వా వద్ద ఉన్న గూగుల్ ఆఫీస్‌లో ఉన్నట్లు చెప్పాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన గుగూల్ సిబ్బంది ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పూణే పోలీసులకు సమాచారం అందించగా.. బాంబ్ స్క్వాడ్ బృందం అక్కడికి చేరుకుని కార్యాలయం ప్రాంగణంలో క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే కార్యాలయంలో ఎలాంటి క్లూ లభించకపోవడంతో అది ఫేక్ కాల్‌గా గుర్తించారు.
కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఫోన్ చేసి బెదిరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముంబై పోలీసులు అతడినికి అక్కడికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. కాల్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటనేది ఇప్పటివరకు ఇంకా వెల్లడి కాలేదు. అతడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 505 (1) (బీ), 506 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. గతంలో ఎన్‌ఐఏ ముంబై కార్యాలయానికి కూడా ఇలాగే ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. తాలిబన్లతో సంబంధం ఉన్న వ్యక్తి ముంబైలో దాడి చేస్తాడని మెయిల్‌లో రాశాడు. దీంతో అప్పటి నుంచి ముంబై పోలీసులు, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అప్రమత్తంగా ఉన్నారు. బెదిరింపు మెయిల్ పంపించిన వ్యక్తి ఐపీ అడ్రస్ ఆధారంగా ట్రెస్ చేయగా.. పాకిస్థాన్‌కు చెందినదిగా తేలింది. ఇది ఫేక్ మెయిల్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే మెయిల్ పంపించారని అనుమానిస్తున్నారు.
Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఒకేసారి మూడు కీలక ప్రకటనలు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Google Office Bomb Threat: గూగుల్ ఆఫీస్‌కు బాంబ్ బెదిరింపు కాల్.. పరుగులు పెట్టిన పోలీసులు