Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్​కు కొత్త బాస్ ఆకాశ్​ అంబానీ?

Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్​  ఛైర్మన్ ముకేశ్ అంబానీ కీలక విషయాలు వెల్లడించారు. సంస్థ నాయకత్వ మార్పు ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. తమ వారసులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 03:05 PM IST
  • నాయకత్వ మార్పులపై రిలయన్స్ దృష్టి
  • అధికారికంగా వెల్లడించిన ముకేశ్​ అంబానీ
  • వారసులపై పూర్తి నమ్మకం ఉందని వెల్లడి
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్​కు కొత్త బాస్ ఆకాశ్​ అంబానీ?

Reliance Industries: దేశీయ అతిపెద్ద లిస్టెడ్​ కంపెనీ (Biggest listed Company in India) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్​ (ఆర్​ఐఎల్​)​ నాయకత్వంలో త్వరలోనే మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్​ బాధ్యతలను తరువాతి తరానికి అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంస్థ ప్రస్తుత ఛైర్మన్​ ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్​ అంబానీకి (Mukesh on Akash Ambani) ఆ బాధ్యతలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ముకేశ్ అంబానీ తాజాగా ఈ విషయంపై ప్రస్తావించారు. కంపెనీ నాయకత్వంలో మార్పులు ఉంటాయని (Mukesh Ambani hinted at a leadership transition) క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా యువతరానికి పగ్గాలు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. తనతో సహా సీనియర్ స్థాయి వారందరి స్థానాల్లోనూ మార్పులు తప్పనిసరి అని (Mukesh Ambani on leadership Chage in Reliance) చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయనున్నట్లు వివరించారు. రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకులు ధీరుభాయ్​ అంబానీ.. జయంతి సందర్భంగా ముకేశ్​ ఈ విషయాలను ప్రస్తావించారు.

వారిపై పూర్తి నమ్మకం..

ముకేశ్​ అబానీ వయసు 64 సంవత్సరాలు ఈ నేపథ్యంలో బాధ్యతలు, నాయకత్వ మార్పులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముకేశ్​కు మొత్తం ముగ్గురు సంతానం. అందులో ఆకాశ్​, ఈశాలు కవలలు. అనంత్​ చిన్న కుమారుడు. వారిలో అకాశ్​ అంబానీకి కంపెనీ బాధ్యలు అప్పగించే వీలుదని సంకేతాలు ఇచ్చారు ముకేశ్​ అంబానీ.

దీనితో పాటు, ఆకాశ్​, ఈశా, అనంత్​లపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. వారు తమ సంస్థను ఉన్నత శిఖరాలకు చేరుస్తారని వివరించారు. వారికి ఆ ప్రతిభ ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్​ వ్యవహారాల్లో ఆకాశ్​, ఈశాలు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

రిలయన్స్ గురించి..

రిలయన్స్ ఇండస్ట్రీస్​ భారత్​ సహా వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చమురు​ వ్యాపారాల ద్వారా సంస్థ కార్యకలాపాలు సాగించేది. ఆ తర్వాత వివిధ రంగాల్లోకి ప్రవేశించింది.

ప్రస్తుతం చమురు, పెట్రో కెమికల్​, టెలికాం, రిటైల్​, మీడియా, వినోదం సహా అనేక రంగాలకు విస్తరించింది. ఈ సంస్థ నుంచి వచ్చిన జియో టెలికాం రంగంలో ఓ సంచలనంగా చెప్పొచ్చు. బీఎస్ఈ ప్రకారం సంస్థ విలువ ప్రస్తుతం రూ.16 లక్షల (Reliance industries Value) కోట్లకు చేరువలో ఉంది.

Also read: Flipkart Year End Sale: రూ.19,999 ధర గల Realme 8s 5g స్మార్ట్ ఫోన్ కేవలం రూ.549కే..త్వరపడండి!

Also read: Best Electric Cars : దేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు, వాటి ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News