Most Highest Selling Car In India: మారుతి సుజుకి ఆల్టో కారుతో ఇండియాకు దాదాపు 2 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో కారుకి ఒక క్రేజ్ ఉంది. చిన్న బడ్జెట్ మాత్రమే ఉన్న వాళ్లు , చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్లు , చిన్న చిన్న అవసరాలు మాత్రమే ఉన్నవాళ్లు, సొంతంగా ఒక కారు ఉండాలి అనే కలలు కనే వారు.. ఇలాంటి వాళ్లందరికి కనిపించే ఏకైక బెస్ట్ ఆప్షన్ గా మారుతి సుజుకి ఆల్టో కారు పేరు సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు మొత్తం 45 లక్షలకు పైగా అమ్ముడైన మారుతి సుజుకి ఆల్టో కార్లు
ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 45 లక్షలకు పైగా మారుతి సుజుకి కార్లు అమ్ముడయ్యాయి. ఆల్టో కారు తొలిసారిగా 2000 సంవత్సరంలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. వచ్చిన నాలుగు సంవత్సరాల్లోనే.. అంటే 2004 నాటికే ఇండియాలో టాప్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఇండియాలో ఈ కారు లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు అతి తక్కువ ధరలో లభిస్తున్న కార్లలో మారుతి సుజుకి ఆల్టో కారు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటోంది. అందుకే మారుతి సుజుకి ఆల్టో కారుకి ఈ రికార్డు సాధ్యమైంది.
మారుతున్న పరిస్థితులు, కార్ల తయారీలో ఆధునికత, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండు దశాబ్ధాల క్రితం లాంచ్ అయిన మోడల్ నుండి ఇప్పటివరకు ఎన్నో మార్పులుచేర్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు బేసిక్ మోడల్ కారులానే అనిపించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం మిగతా అన్ని కార్లలో ఉన్న అత్యాధునిక ఫీచర్స్, సౌకర్యాలు మారుతి సుజుకి ఆల్టోలోనూ అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, ఆటో గేర్ షిఫ్ట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీఎన్జీ వెర్షన్స్.. ఇలా వాట్స్ నాట్ ఎవ్రీథింగ్ మారుతి సుజుకి ఆల్టోలో చూడవచ్చు. అందుకే లో బడ్జెట్ కార్లు ఎన్ని లాంచ్ అయినప్పటికీ.. ఇప్పటికీ మారుతి సుజుకి ఆల్టోకి క్రేజ్ తగ్గలేదు.
ఇది కూడా చదవండి : Hyundai Cars On Discount Sale: హ్యూందాయ్ కార్లపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు
ఇండియాలో 45 లక్షల మారుతి సుజుకి ఆల్టో యూనిట్స్ అమ్ముడవడం గురించి మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, " గత 2 దశాబ్దాలుగా ఆల్టో కారు మా కస్టమర్ల జీవితాల్లో ఎంతో అనుబంధాన్ని ఏర్పరచుకుందని... ఇంత భారీ సంఖ్యలో కార్లు అమ్ముడయ్యాయంటే.. కస్టమర్స్‌కి మారుతి సుజుకిపై ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు " అని అన్నారు.
ఇది కూడా చదవండి : Car Insurance in Floods: కారు వరదల్లో మునిగితే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.