ITR Filing: 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఐటీఆర్ దాఖలకు ఇవాళ్టితో గడువు ముగియబోతోంది. గడువును మరోసారి పెంచలేమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసుకుంటే జరిమానాలు, ఆలస్య రుసుములు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఐటీఆర్ దాఖలు చేసుకోని వారంతా నేటితో ఫిలింగ్ చేయాలని..రేపటి నుంచి రూ.5 వేల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇవాళ్టి రాత్రి వరకు ఐటీ రిటర్న్ చేసుకోవచ్చు. రేపటి నుంచి డిసెంబర్ 31 వరకు జరిమానాలతో ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. వేతన జీవులు, హెచ్‌యూఎఫ్..ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి జూన్ 31 చివరి తేది. మరోవైపు ఇప్పటివరకు 5.10 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో ఐటీఆర్ ఫిలింగ్ చేసుకునేందుకు పన్ను చెల్లింపు దారులు బారులు తీరుతున్నారు. శనివారం ఒక్కరోజే 57.71 లక్షల మందికిపైగా ఐటీఆర్‌లు దాఖలైయ్యాయి.
ఈమేరకు ఐటీ శాఖ ట్వీట్ చేసింది. రాత్రి లోపు మరిన్ని రిటర్న్‌లు దాఖలయ్యే అవకాశం ఉంది. గడువు పెంపు అంశమే తమ దృష్టిలో లేదని ఐటీ విభాగం తేల్చి చెప్పింది. ఐటీఆర్ దాఖలు చేయకుంటే వెంటనే చేయాలని ట్విట్టర్ వేదికగా ఐటీ శాఖ కోరింది. ఐతే కొందరు పన్ను చెల్లింపుదారులు, వృత్తి నిపుణులు మాత్రం చివరిక్షణంలో గడువు పెంపు ఉంటుందని భావిస్తున్నారు. eportal.incometax.gov.in అనే వెబ్‌సైట్‌లో ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు.
More than 5.10 crore ITRs have been filed till 30th July,2022. Over 57.51 lakh #ITRs were filed on 30th July,2022 itself.
Do remember to file yours, if not filed as yet. #FileNow to avoid late fee.
Today is the due dt to file #ITR for AY 2022-23
Pl visit: https://t.co/GYvO3n9wMf pic.twitter.com/3bVrHid1MF— Income Tax India (@IncomeTaxIndia) July 31, 2022
Also read:Telangana Rains: తెలంగాణకు ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన..పిడుగులు పడే ప్రాంతాలు ఇవే..!
Also read:August 1st: రేపటి నుంచి అమలుకానున్న కొత్త నిబంధనలు..స్పెషల్ స్టోరీ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా..?
నేటితో ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పూర్తి
పోటెత్తిన పన్ను చెల్లింపుదారులు
రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు