MG Gloster vs Fortuner: ఫార్చ్యూనర్‌కు తలదన్నేలా ఎంట్రీ ఇవ్వనున్న ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, ఇవే కొత్త ఫీచర్లు

MG Gloster vs Fortuner: దేశంలో హై ఎండ్ ఎస్‌యూవీల్లో అగ్రశ్రేణి రకానికి చెందింది టొయోటా ఫార్చ్యూనర్. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ ఇప్పుడు ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ గట్టి పోటీ ఇచ్చేట్టు కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 30, 2023, 05:12 PM IST
MG Gloster vs Fortuner: ఫార్చ్యూనర్‌కు తలదన్నేలా ఎంట్రీ ఇవ్వనున్న ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, ఇవే కొత్త ఫీచర్లు

MG Gloster vs Fortuner: దేశంలో చాలా కంపెనీలు ఎస్‌యూవీలు లాంచ్ చేశాయి. ఇంకా చేస్తున్నాయి. కానీ అగ్రశ్రేణి ఎస్‌యూవీలు మాత్రం చాలా తక్కువ. ఎంజీ గ్లోస్టర్ ఎస్‌యూనీ ఇండియాలో ఎంట్రీ ఇచ్చి అప్పుడే మూడేళ్లు దాటేస్తోంది. ఇప్పుడు త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కానుంది. ఈ కొత్త వెర్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

ఎంజీ గ్లోస్టర్ ఇండియాలో 2020లో ప్రవేశపెట్టారు. మూడేళ్ల తరువాత కంపెనీ ఇప్పుడు ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ అప్‌డేటెడ్ మోడల్ టెస్టింగ్ ప్రారంభమైపోయింది. 2024లో లాంచ్ చేయవచ్చు. ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజన్ కాకుండా ఇతర మార్పులు చాలా ఉండవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో మార్కెట్‌లో అగ్రశ్రేణి ఎస్‌యూవీగా ఉన్న టొయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇవ్వవచ్చని అంచనా. ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్ డైమండ్ కట్ ఎల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ రేర్ లభిస్తుంది. ఇందులో కొత్త బంపర్, రివైజ్డ్ టెయిల్ ల్యాంప్, రీడిజైన్డ్ టెయిల్ గేట్, రిఫ్లెక్టర్ ఉంటాయి. ముందు భాగంలో మార్పు ఉండవచ్చు. ఇందులో రీ డిజైన్డ్ గ్రిల్, రివైజ్డ్ బంపర్, రీడిజైన్డ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. అయితే ఇంటీరియర్ ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టత లేదు. డ్యాష్ బోర్డ్ మారవచ్చని తెలుస్తోంది. 

ఎంజీ గ్లోస్టర్ ఇంతకుముందే పీచర్ లోడెడ్ కారు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్, ప్యానోరమిక్ సన్‌రూఫ్, 12 స్పీకర్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ పార్కింగ్ కెమేరా, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్, మెమరీ ఫంక్షన్‌తో పాుట పవర్డ్ డ్రైవర్ సీట్, ఐ స్మార్ట్ కనెక్టెడ్ కారు టెక్నిక్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, పెడల్ షిఫ్టర్స్, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. త్రీ జోన్ క్లైమెట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 

2024 కొత్త ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ ప్రసుతం ఉన్న 2.0 లీటర్ 4 సిలెండర్ టర్బో డీజిల్ ఇంజన్‌తోనే వస్తుంది. ఇది 375 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 163 బీహెచ్‌పి సామర్ధ్యం కలిగింది. 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ అయితే 480 ఎన్ఎం టార్క్, 218 బీహెచ్‌పి సామర్ధ్యం కలిగినదై ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో 4 వీల్ డ్రైవ్ ఉంటుంది. రెండు ఇంజన్లతో కలిపి 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. 

Also read: 5 Day Week: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, త్వరలో అటు జీతం ఇటు సెలవులు రెండూ పెరగడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News