HDFC Hike MCLR Rate: దేశమంతా హోలీ పండుగ రంగుల్లో మునిగిపోయిన తరుణంలో.. అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రజలను షాక్‌కు గురి చేసింది. ఈ ప్రైవేట్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు ఇకనుంచి అధిక భారాన్ని వడ్డీ రూపంలో భరించాల్సి ఉంటుంది. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ బేస్డ్ వడ్డీ రేట్ల (ఎంసీఎల్ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే ఇప్పుడు హెచ్డీఎఫ్సి బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 0.05 శాతం పెరిగింది. ఈ ప్రైవేట్ బ్యాంక్ కేవలం ఎంసీఎల్ఆర్ ఆధారంగా అనేక రకాల రుణాల వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పెరిగిన వడ్డీ రేట్లు ఈ నెల 7వ తేదీ నుంచి అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది.
హెచ్డీఎఫ్సీ ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి చేరుకుంది. ఒక నెలకు 8.65 శాతం, మూడు నెలలకు 8.70 శాతం, ఆరు నెలలకు 8.80 శాతంగా మారింది. ఒక ఏడాదికి 8.95 శాతానికి, రెండేళ్లకు 9.05 శాతానికి, మూడేళ్లకు 9.15 శాతానికి చేరుకుంది. ఎంసీఎల్ఆర్లో పెంపుతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది. ఇది వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుంది. అందరికీ వడ్డీ రేట్లు పెరగడం ఖాయమైనా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మీకు లోన్ ఇవ్వాలంటే సిబిల్ స్కోర్, మీ ఉద్యోగం మొదలైన అనేక అంశాలను పరిశీలిస్తుంది.
ఎంసీఎల్ఆర్ను ఏప్రిల్ 2016లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది కనీస వడ్డీ రేటును సూచిస్తుంది. నిర్దిష్ట సందర్భాలలో తప్ప.. ఆర్థిక సంస్థలు లోన్ ఇవ్వలేవు. ఇది గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలకు వర్తిస్తుంది. ఎంసీఎల్ఆర్ పెరుగుదలతో.. రుణాలపై ఈఎంఐ మరింత పెరుగుతాయి. ఫిక్స్డ్ రేటు హోమ్ లోన్స్‌పై ఎంసీఎల్ఆర్ ప్రభావం ఉండదు. డిపాజిట్ నిల్వలు, ఇతర లోన్లు ఎంసీఎల్ఆర్ గణన సమయంలో పరిగణిస్తారు. ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్ మంజూరు తేదీ నుంచి ఎంసీఎల్ఆర్ తదుపరి రీసెట్ తేదీ వరకు అదే వడ్డీ రేటు ఉంటుంది.
Also Read: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు తప్పదా, రేపు ఏం జరగనుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.