Car Rental: మారుతి సుజుకి బంపరాఫర్.. రూ.12 వేలకే నెల పాటు అద్దె కారు..

Maruti Suzuki Monthly car rent for Rs.12,199: దేశంలో అద్దె కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మారుతి సుజుకీతో క్విక్లిజ్‌తో కలిసి అందుబాటు ధరల్లో అద్దె కార్లను ఆఫర్ చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 11:06 AM IST
  • కస్టమర్లకు మారుతి సుజుకీ బంపరాఫర్
  • కేవలం రూ.12,199కే నెల పాటు అద్దె కారు
  • క్విక్లిజ్‌తో టైఅప్ అయిన మారుతి సుజుకి
Car Rental: మారుతి సుజుకి బంపరాఫర్.. రూ.12 వేలకే నెల పాటు అద్దె కారు..

Maruti Suzuki Monthly car rent for Rs.12,199: దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మహీంద్రా ఫైనాన్స్‌కి చెందిన కార్ లీజింగ్ ప్లాట్‌ఫామ్‌ క్విక్లిజ్ (Quicklyz)తో కలిసి రెంటల్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ద్వారా కేవలం రూ.12,199తో ఒక నెల పాటు కారును అద్దెకు తీసుకోవచ్చు. ఇప్పటికే Oryx, Miles, ALD కంపెనీలతో కలిసి దేశంలోని 20 నగరాల్లో ఆటో మొబైల్ రెంటల్ సర్వీసులను మారుతి సుజుకి అందిస్తోంది. ఆ సేవలను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు తాజాగా క్విక్లిజ్ కంపెనీతో టైఅప్ అయింది.

నిజానికి జులై, 2020 లోనే 'సబ్‌స్క్రైబ్' ప్రోగ్రామ్ కింద ఆటోమొబైల్ రెంటల్ సర్వీస్‌ను మారుతి సుజుకి అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, పుణే, చెన్నై, ముంబై, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, మంగళూరు, కోల్‌కతా, మైసూర్‌లలో ఈ రెంటల్ సర్వీస్ అందుబాటులో ఉంది. మారుతి సుజుకితో టైఅప్‌పై క్విక్లిజ్ బిజినెస్ హెడ్ తుర్రా మహమ్మద్ మాట్లాడుతూ.. దేశంలో కార్ రెంటల్ సర్వీస్‌కు కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతోందన్నారు. మారుతి సుజుకితో కలిసి అందించనున్న సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ ద్వారా కస్టమర్లకు సూపర్ కన్వినియెన్స్‌తో పాటు సాటిలేని ఫ్లెక్సిబిలిటీతో కూడిన సేవలను అందించనున్నట్లు తెలిపారు.

మారుతి సుజుకి-క్విక్లిజ్ సంయుక్తంగా అందించనున్న కార్ రెంటల్ సర్వీస్‌ ద్వారా కేవలం రూ.12,199కి ఒక నెల పాటు కారును అద్దెకి తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి డౌన్ పేమెంట్ ఉండదు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, 24 గంటల రోడ్‌ సైడ్ అసిస్టెన్స్ తదితర ఛార్జీలతో కలిపి నెలకు రూ.12,199 వసూలు చేస్తారు.

కస్టమర్‌ తన అవసరాలకు అనుగుణంగా ఎంత కాలానికైనా కారును అద్దెకు తీసుకోవచ్చు. ఒకసారి టెన్యూర్ ముగిశాక.. అప్పటివరకూ వాడిన కారు స్థానంలో మరో కారును ఎంచుకునే ఛాయిస్ కూడా ఉంటుంది. అంతేకాదు, సబ్‌స్క్రైబ్ చేసుకున్న కారును కస్టమర్ కొనుగోలు కూడా చేయవచ్చు. మారుతి సుజుకీ ఇప్పటికే Oryx, Miles, ALD కంపెనీలతో టైఅప్ అయి ఉన్నందునా.. వాటి ద్వారా కూడా మారుతి సుజుకీ రెంటల్ కార్ సర్వీస్‌ను పొందవచ్చు.

Also Read: RBI Jobs: ఆర్​బీఐలో భారీగా ఉద్యోగాలు- దరఖాస్తు, పరీక్ష తేదీలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News