Maruti Baleno @ Rs1.5 Lakhs: రూ. 1.5 లక్షలకే Maruti Baleno మీ సొంతం, వడ్డీ రేటు కూడా తక్కువే.. త్వరపడండి!

Maruti Baleno @ Rs1.5 Lakhs: మారుతి బాలెనో బేస్ వేరియంట్ ప్రత్యేకమైన ఈఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కారును డౌన్‌ పేమెంట్‌తో 5 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టి ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే చాలా తక్కవ వడ్డి పడుతుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2023, 08:43 PM IST
Maruti Baleno @ Rs1.5 Lakhs: రూ. 1.5 లక్షలకే Maruti Baleno మీ సొంతం, వడ్డీ రేటు కూడా తక్కువే.. త్వరపడండి!

Maruti Baleno @ Rs1.5 Lakhs: ప్రస్తుతం మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న కార్లలో మారుతి బాలెనో ఒకటి. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో అత్యధిక అమ్ముడైన కార్లలో ఈ కారు కూడా ఒకటి. అయితే తక్కువ బడ్జెట్లో అత్యధిక ఫీచర్లు ఉన్న కారుని కొనుగోలు చేయాలనుకుంటే ఈ కారు సరైనదిగా భావించవచ్చు. అంతేకాకుండా మార్కెట్లో డిమాండ్ ను బట్టి ఈ కారుపై పలు డిస్కౌంట్ ఆఫర్లను కూడా కస్టమర్లకు అందిస్తోంది మారుతీ కంపెనీ. EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే ఈ కారుపై కొన్ని ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బాలెనో కారును కేవలం రూ. 1.5 లక్షల డౌన్ పేమెంట్ కట్టి పొందవచ్చు.  ఇలా డౌన్ పేమెంట్ కట్టి ఐదు సంవత్సరాల EMI చెల్లిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి బాలెనో బేస్ వేరియంట్ సిగ్మా వివరాలు గురించి తెలుసుకున్నట్లయితే.. దీని ఎక్సైజ్ షోరూమ్ ధర రూ. 6.65 లక్షలు ఉండగా ఆన్ రోడ్ ప్రైస్ రూ. 7.44 లక్షలు గా ఉంది. ఈ కారుని మీరు రూ. 1.5 లక్షల డౌన్ పేమెంట్ చేసి.. మిగతా రూ. 5.94 లక్షలను EMI రూపంలో కట్టొచ్చు. 

ఈ కారుపై EMI ఐదు సంవత్సరాల పాటు కడితే.. కేవలం 9.8% వడ్డీ మాత్రమే పడుతుంది. ఈ కారుకు మొత్తం మీరు రూ. 1.59 లక్షలు మాత్రమే వడ్డీ కట్టినట్లు. అంతేకాకుండా ఇంకొన్ని సంవత్సరాల పాటు కూడా EMI ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్టెండ్ చేసుకునే విధానాన్ని బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇలా ఐదు సంవత్సరాల పాటు ప్రతినెల రూ.12,577 మాత్రమే EMI కట్టాల్సి ఉంటుంది. 

ఇటీవల కొత్తగా లాంచ్ అయిన కారులో కొత్త ఫీచర్లు:

  • 360-డిగ్రీ కెమెరా
  • హెడ్-అప్ డిస్ప్లే
  • ఫాస్ట్ ఛార్జింగ్ USB పోర్ట్ 
  • LED ఫాగ్ ల్యాంప్స్
  • రీడిజైన్ చేయబడిన LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు
  • Apple CarPlay,  Android Auto
  • 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • రియర్‌వ్యూ కెమెరా
  • వైర్‌లెస్ ఛార్జర్ 
  • క్రూయిజ్ కంట్రోల్

Also Read: Diabetes Control Tips: ప్రతి రోజూ ఈ 5 నియమాలు పాటిస్తే మధుమేహం జీవితంలో రాదు, ఉన్నవారికి దిగి రావడం ఖాయం!

Also Read:Diabetes Control Tips: ప్రతి రోజూ ఈ 5 నియమాలు పాటిస్తే మధుమేహం జీవితంలో రాదు, ఉన్నవారికి దిగి రావడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News