Mahindra SUV Cars: మహీంద్రా ఆ మూడు కార్ల వెయిటింగ్ పీరియడ్ చూస్తే క్రేజ్ ఎలా ఉందో అర్ధమౌతుంది

Mahindra SUV Cars: దేశీయంగా  చాలా కారు కంపెనీలు ఉన్నా కొన్ని కంపెనీలకు క్రేజ్ ఎక్కువ. మారుతి, టాటా తరువాత దేశంలో అత్యధికంగా ఇష్టపడే కంపెనీ మహీంద్రా. గత కొద్దికాలంగా మారుతి సుజుకి తరువాత స్థానంలో మహీంద్రా నిలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2023, 11:39 AM IST
Mahindra SUV Cars: మహీంద్రా ఆ మూడు కార్ల వెయిటింగ్ పీరియడ్ చూస్తే క్రేజ్ ఎలా ఉందో అర్ధమౌతుంది

Mahindra SUV Cars: మహీంద్రా కంపెనీ పేరు చెప్పగానే ఎస్‌యూవీ కార్లు గుర్తొస్తాయి. ఎందుకంటే మహీంద్రా ఎస్‌యూవీలకు అంతగా ప్రాచుర్యం పొందింది. స్కార్పియో కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ల క్రితమే స్కార్పియో ఇండియాలో లాంచ్ అయింది. ఇప్పటికి కూడా మహీంద్రా కంపెనీ కార్లు కొన్ని వెయిటింగ్ పీరియడ్‌లో ఉన్నాయంటే వాటికున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల తన నెలసరి ఉత్పాదన సామర్ధ్యాన్ని 49 వేలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా మహీంద్రా కంపెనీకు చెందిన స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్, ఎక్స్‌యూవీ 700, థార్ వంటి  డిమాండ్ ఉన్న కార్లకు వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం కంపెనీ నెలకు 39 వేల యూనిట్లు ఉత్పత్తి చేస్తోంది. ఇక ఇప్పుడు స్కార్పియో, ఎక్స్‌యూవీ 700, థార్ కార్ల వెయిటింగ్ పీరియడ్ వివరాలు తెలుసుకుందాం.

Mahindra XUV7 00

మహీంద్రా ఎక్స్‌‌యూవీ 700 అనేది పెట్రోల్ డీజిల్ వేరియంట్ కార్లపై 3 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంటే ఇప్పుడు బుక్ చేస్తే 3 నెలలు ఆగాల్సిందే. ఏఎక్స్ 7 వేరియంట్‌పై అయితే ఏకంగా 5 నెలలు ఆగాల్సిన పరిస్థితి.  AX7L అయితే 6 నెలల నిరీక్షణ తప్పదు. అదే ఎంఎక్స్, ఏఎక్స్ 3 పెట్రోల్-డీజిల్ వేరియంట్లపై 2 నెలలు ఆగాల్సి ఉంటుంది. 

Mahindra Thar

మహీంద్రా థార్‌కు చెందిన 4X2 వేరియంట్‌పై ఇప్పటికీ 15-16 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంటే దాదాపు ఏడాదిన్నర మర్చిపోవల్సిందే. థార్ 4X4 పెట్రోల్-డీజిల్ వేరియంట్‌పై అయితే 5-6 నెలలు వెయిటింగ్ ఉంది. 

Mahindra Scorpio N-Scorpio Classic

స్కార్పియో ఎన్ Z8L పెట్రోల్-డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లపై వెయిటింగ్ పీరియడ్ కేవలం 2-3 నెలలే ఉంది. డీజిల్ వేరియంట్‌పై 1-2 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇది కాకుండా Z4,Z6,Z8 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లపై 2-3 నెల ల వెయిటింగ్ పీరియడ్ ఉంది. అయితే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఫీచర్ ఉన్న పెట్రోల్-డీజిల్ వెర్షన్లపై 9 నెలలు ఆగాల్సి ఉంటుంది. ఇక జెడ్4 పెట్రోల్-డీజిల్ మేన్యువల్, జెడ్ 6 డీజిల్ మేన్యువల్‌పై 6-8 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అదే స్కార్పియో క్లాసిక్ ఎస్, ఎస్11 వేరియంట్లపై 4 నెలల వెయిటింగ్ నడుస్తోంది.

Also read: Dussehra Car Offers: దసరాలో ఆఫర్ల సందడి, ఈ రెండు కార్లపై ఊహించని భారీ డిస్కౌంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News