LPG link Aadhaar: ఇప్పుడు కొత్తగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ కార్డులో లింక్ చేయమని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ సబ్సిడీ ప్రయోజనం మీకు అందదు. అయితే లింకింగ్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.
ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ పొందాలంటే ఆధార్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం చేయాలి. అప్పుడే ఎల్పీజీ సబ్సిడీ అందుతుంది. ఒకవేళ మీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డుతో లింక్ కాకపోతే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదుయ ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో సులభంగా లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ కార్డులో లింక్ చేయాలంటే ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సెల్ఫ్ సీడింగ్ పేజ్ లోకి వెళ్లాలి. అందులో అడిగిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఇక్కడ మీరు ఎల్పీజీ సెలెక్ట్ చేసుకుని సంబంధిత గ్యాస్ కంపెనీ ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లలో ఏదనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ ముందు డిస్ట్రిబ్యూటర్ల జాబితా కన్పిస్తుంది. అందులో మీ డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేయాలి. ఆ తరువాత గ్యాస్ కనెక్షన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో వివరాలు ధృవీకరించుకోవాలి. అంతే మీ ఆధార్ కార్డు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌తో లింకింగ్ పూర్తయినట్టే
ఆధార్ లింక్ చేసేటప్పుడు గుర్తుంచుకోవల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ ఎవరిపేరుపై ఉందో వారి ఆధార్ కార్డుతోనే లింకింగ్ చేయాలి. ఆధార్ కార్డుతో బ్యాంక్ ఎక్కౌంట్ లింక్ అయుండాలి. ఆధార్ కార్డుపై మీ మొబైల్ నెంబర్ ఉండి తీరాలి. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పేరు, ఆధార్ పేరు ఒకటే అయుండాలి.
ఆఫ్‌లైన్‌లో కూడా ఆధార్ కార్డును ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌తో లింక్ చేయవచ్చు. దీనికోసం మీరు మీ డీలర్ వద్దకు వెళ్లి ఆ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చే లింకేజ్ దరఖాస్తు నింపి ఇవ్వాలి. మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ జత చేయాలి. ఇలా లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
Also read: PPF Account: నెలకు 5 వేలు, మెచ్యురిటీ తరువాత 42 లక్షల రూపాయలు..ఎలాగో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook