Discontinued Cars & SUVs In 2023: కారు కొనే వారిలో చాలామంది ఆ కారు గురించి ధర, మైలేజ్, కంఫర్ట్, ఫీచర్స్, ఫ్యూయెల్ అవైలబిలిటీ, సేఫ్టీ.. ఇలా ఎన్నో విషయాలు ఆలోచిస్తారు కానీ ఒక్క విషయంలో మాత్రం కొంతమంది పొరపాటు చేస్తారు. ఆ ఒక్క విషయం ఏంటంటే... ఆ కారు సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్‌పై ప్రభావం చూపే అంశమైన కారు మనుగడ. అవును.. మనం కొనే కారు డిస్కంటిన్యూ అయిన కారు అయ్యుంటే.. కొన్నేళ్లు గడిచిన తరువాత ఆ కారుకు సంబంధించి ఏదైనా సమస్యలు తలెత్తితే వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ లేదా సర్వీసింగ్ కానీ అంత ఈజీగా లభించవు.
డిస్కంటిన్యూ చేసిన కార్లకు కూడా అన్ని సేవలు అందుబాటులో ఉండేలా చూసుకుంటాం అని ఆయా కంపెనీలు ప్రకటించినప్పటికీ.. అది అన్నిసార్లు, అన్ని ప్రాంతాల్లో సాధ్యపడదు. మన టైమ్ బాగోలేకపోతే.. ఒక్కోసారి స్పేర్ పార్ట్స్ కోసం రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తుంది. లేదంటే సరిగ్గా వాటికి సూటయ్యే మరో మోడల్ స్పేర్ పార్ట్స్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. వాటి పని తీరు ఒక్కోసారి ఒరిజినల్ పార్ట్స్ కండిషన్ తరహాలో ఉండదు. అందుకే ఈ ఏడాది కొత్తగా డిస్కంటిన్యూ అయిన కార్ల జాబితా ఏంటో ఓ లుక్కేద్దాం రండి.
మారుతి సుజుకి ఆల్టో 800 కారు :
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది మారుతి సుజుకి 800 ఆల్టో. దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా సొంత కారు కొనుక్కోవాలన్న కొన్ని కోట్ల మంది భారతీయుల కలలను నిజం చేసిన కారు మోడల్ ఇది. మరీ ముఖ్యంగా అతి తక్కువ ధరతో సాధారణ, మధ్య తరగతికి అందుబాటులో ఉంటూ వచ్చిన ఈ కారును మారుతి సుజుకి డిస్ కంటిన్యూ చేసింది. 796 సీసీ పెట్రోల్ ఇంజన్ కారును మారుతి సుజుకి నిలిపేసింది. ఈ కారు ఎక్స్ షోరూం ధర కేవలం రూ. 3.54 లక్షలు మాత్రమే.
టొయొటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ కారు :
ఈ జాబితాలో చెప్పుకోదగిన మరో కారు టొయొటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ కారు. మంది మార్బలం వెంటేసుకుని తిరిగే కొంతమంది రాజకీయ నాయకులు, బడా బాబులు ఎక్కువగా వాడుతూ కనిపించిన కార్లలో ఇది ఒకటి. టొయొటా ఇన్నోవా క్రిస్టా మోడల్లో 2.7 - లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్ కారుని ఆ కంపెనీ నిలిపేసింది. 5 స్పీడ్ మాన్వల్ గేర్ బాక్స్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సులతో లభించిన ఈ కారు 164 bhp పవర్ 245 Nm టార్కుని ఉత్పత్తి చేసేది.
హ్యూందాయ్ i20 డీజిల్ కారు :
ఇండియాలో డీజిల్ కార్లపై ఆంక్షలు కఠినమైన నేపథ్యంలో హ్యూందాయ్ కంపెనీ హ్యూందాయ్ i20 డీజిల్ కారు ఉత్పత్తిని నిలిపేసింది. 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ తో నడిచే ఈ కారుకు 6 స్పీడ్ మ్యాన్వల్ గేర్ బాక్సు ఉండేది.
హోండా WR-V కారు :
హోండా WR-V కారు రెండు రకాల ఇంజన్ వేరియంట్స్ లో లభించేది. అందులో ఒకటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా మరొకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 89 bhp, 90 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తే.. రెండో రకమైన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 100 bhp 200 Nm టార్క్ ని ఉత్పత్తి చేసేది.
హోండా సిటీ 4th జనరేషన్ :
ఈ జాబితాలో నెక్ట్స్ వచ్చే కారు హోండా సిటీ 4th జనరేషన్ కారు. 2014 లో లాంచ్ అయిన ఈ హోండా సిటీ 4th జనరేషన్ కారు 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభించేది. 5 స్పీడ్ గేర్ బాక్సులతో లభించిన ఈ కారు మేకింగ్ ని తాజాగా కంపెనీ నిలిపేసింది.
ఇది కూడా చదవండి : Cheap And Best Cars: ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా ? టెన్షన్ వద్దు.. ఇదిగో లిస్ట్
హోండా అమేజ్ డీజిల్ కారు, హోండా జాజ్, మహింద్రా అల్టురాస్ G4, మహింద్రా మరాజో, మహింద్రా KUV100, నిసాన్ కిక్స్, రెనాల్ట్ క్విడ్ 800, టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వంటి కార్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Hyundai Exter Vs Maruti Suzuki Fronx: హ్యూందాయ్ ఎక్స్టర్ vs మారుతి సుజుకి ఫ్రాంక్స్.. రెండింట్లో ఏది బెటర్ కారు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి