Tax payers: ప్రపంచంలో మూడవ కుబేరుడే, కానీ ట్యాక్స్ పేయర్లలో టాప్ 15 లో కూడా లేని అదానీ

Tax payers: ప్రపంచంలోనే అత్యంత కుబేరుల జాబితాలో ఇండియన్లు ఉన్నారు. కానీ ట్యాక్స్ పేయర్ల జాబితాలో మాత్రం కొందరే ఉన్నారు. క్రమబద్ధంగా ట్యాక్స్ చెల్లిస్తూ దేశ నిర్మాణంలో తోడ్పడేది కొందరే. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2023, 09:06 AM IST
Tax payers: ప్రపంచంలో మూడవ కుబేరుడే, కానీ ట్యాక్స్ పేయర్లలో టాప్ 15 లో కూడా లేని అదానీ

దేశంలో కార్పొరేట్ కంపెనీలు కేవలం వ్యాపారం చేసి లాభాలు ఆర్జించడమే కాదు..లాభాలు ఆర్జించే క్రమంలో ట్యాక్స్ రూపంలో జాతి నిర్మాణానికి దోహదపడుతున్నారు. దేశంలో ట్యాక్స్ చెల్లించే 15 కంపెనీల జాబితా ఇలా ఉంది. 

కార్పొరేట్ కంపెనీలు ట్యాక్స్ చెల్లిస్తూనే ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. వ్యక్తిగత సామర్ద్యాన్ని పెంచడం ద్వారా మరొకరిపై ఆధారపడకుండా చేస్తున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని టాప్ 10 ట్యాక్స్ పేయర్ల జాబితా ఇలా ఉంది.  ఏస్ ఈక్విటీ వద్ద ఉన్న సమాచారం మేరకు 2022 ఆర్ధిక సంవత్సరంలో కనీసం 5000 కోట్లు ట్యాక్స్ చెల్లించే లిస్టెడ్ కంపెనీలు 15 ఉన్నాయి. 1000 కోట్ల కంటే ఎక్కువ ట్యాక్స్ చెల్లించే కంపెనీలు 60 వరకూ ఉన్నాయి. 

ఇందులో అగ్రగామిగా ఉన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ కంపెనీ 2022 ఆర్ధిక సంవత్సరంలో 60,705 కోట్ల నెట్ లాభాలతో 16,297 కోట్లు ట్యాక్స్ చెల్లించింది. అదే సమయంలో 16.5 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉన్న దేశంలోని అత్యంత విలువైన కంపెనీ.  తరువాత ఎస్బీఐ 35,374 కోట్ల నెట్ లాభాలతో 13, 382 కోట్లు
ట్యాక్స్ చెల్లిస్తోంది. ఎస్బీఐ మార్కెట్ వాటా 5 లక్షల కోట్లుగా ఉంది. మూడవ స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది. 36,327 కోట్ల నెట్ లాభాలతో  13,238 కోట్లు ట్యాక్స్ చెల్లించింది. టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11.5 లక్షల కోట్లు.

ఇక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నాలుగవ స్థానంలో నిలిచింది. 38,053 కోట్ల నెట్ లాభాలతో 12,722 కోట్ల ట్యాక్స్ చెల్లించింది. ఇక ఐదవ స్థానంలో మైనింగ్ కంపెనీ వేదాంత నిలిచింది. 18,802 కోట్ల నెట్ లాభాలతో 9,255 కోట్లు ట్యాక్స్ చెల్లించింది. ఇక ఆరవ స్థానంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఉంది. ఈ కంపెనీ 20,665 కోట్ల నెట్ లాభాలతో 8,807 కోట్ల ట్యాక్స్ చెల్లించింది. ఇక 7వ స్థానంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది. 25,102 కోట్ల నెట్ లాభాలతో 8,562 ట్యాక్స్ చెల్లించింది. 

8వ స్థానంలో టాటా స్టీల్ 40,154 కోట్ల నెట్ లాభాలతో 8,478 కోట్లు ట్యాక్స్ చెల్లించింది. ఇక 9వ స్థానంలో ఐసీఐసీఐ బ్యాంకు నిలిచింది. ఈ బ్యాంకు 25,110 కోట్ల నెట్ లాభాలతో 8,457 కోట్లు ట్యాక్స్ చెల్లించింది. చివరిగా పదవ స్థానంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4,125 కోట్ల నెట్ లాభాలతో 8,013 కోట్లు ట్యాక్స్ చెల్లించింది.

ఇక ఆ తరువాత 11 నుంచి 15 స్థానాల్లో వరుసగా ఇన్‌ఫోసిస్ కంపెనీ 7,964 కోట్లు, కోల్ ఇండియా 6,238 కోట్లు, హిండాల్కో ఇండస్ట్రీస్ 5373 కోట్లు, ఐటీసీ 5,237 కోట్లు, ఎన్టీపీసీ 5,047 కోట్ల ట్యాక్స్ చెల్లించాయి.

మరి ప్రపంచంలో మూడవ కుబేరుడిగా, దేశంలోనే అత్యంత ధనికుడిగా ఉన్న అదానీ టాప్ 15 ట్యాక్స్ పేయర్లలో ఎందుకు లేరనేది అర్ధం కాని ప్రశ్న. ట్యాక్స్ ఎగవేత ఇండియాలో నేరమే అయినా..చాలా బడా కంపెనీలు ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నాయి. 

Also read: Aadhaar card Update: ఆధార్‌కార్డులో మీ ఫోటో నచ్చలేదా, సులభంగా ఇలా మార్చుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News