ITR Filing 2023: ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చా, ఎలాగో తెలుసుకోండి

ITR Filing 2023: ప్రస్తుతం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే సమయం. ఐటీ రిటర్న్స్ లేదా రిఫండ్ క్లైమ్ చేయడంలో అందరూ బిజీగా ఉంటుంటారు. ఈ క్రమంలో ఫారమ్ 16 లేకుండా కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2023, 01:41 PM IST
ITR Filing 2023: ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చా, ఎలాగో తెలుసుకోండి

ITR Filing 2023: వేతన జీవులందరూ ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా ప్రైవేటు ఉద్యోగులైనా సరే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. ప్రతి యేటా ఇది తప్పకుండా చేయాల్సిన ప్రక్రియ. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఫారమ్ 16 తప్పనిసరా కాదా..అనేది చాలామందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం..

ఫారమ్ 16 అనేది టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ సర్టిఫికేట్. ఆర్ధిక సంవత్సరం చివర్లో ప్రతి ఉద్యోగికి సంబంధిత కంపెనీ ఇచ్చే ధృవపత్రం. దీని ఆధారంగానే ప్రతి యేటా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. ప్రతి వేతన జీవి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇది తప్పనిసరి. ఇందులో ఆ ఆర్ధిక సంవత్సరంలో ఆ ఉద్యోగి చెల్లించిన మొత్తం ట్యాక్స్ వివరాలు పూర్తిగా ఉంటాయి. ఫారమ్ 16ను కంపెనీ ఆ ఉద్యోగికి ఇస్తుంటుంది.

అయితే కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో ఉద్యోగులకు కంపెనీ నుంచి ఫారమ్ 16 అందదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటే ఏం చేయాలనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. కంపెనీ ఆర్ధిక పరమైన సమస్యల్లో ఉన్నప్పుడు, వ్యాపారం షట్‌డౌన్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఫారమ్ 16 పొందడం కష్టమౌతుంది లేదా ఆలస్యమైపోతుంది. లేదా నియమ నిబంధనలు సరిగ్గా పాటించకుండా ఉద్యోగం వదిలేసినా ఫారమ్ 15 సమయానికి అందదు. అయినా ఈ పరిస్థితుల్లో కూడా ఐట రిటర్న్స్ ఫారమ్ 16 లేకుండానే ఫైల్ చేయవచ్చు. మీ వద్ద ఫారమ్ 16 లేకపోయినా ట్యాక్స్ పేయర్లు పే స్లిప్స్ ఆధారంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఎందుకంటే పే స్లిప్‌లో ట్యాక్స్ డిడక్షన్ వివరాలన్నీ సమగ్రంగా ఉంటాయి.

ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాలున్నాయి. ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటే ఇ ఫైలింగ్ పోర్టల్ సందర్శించాలి. అయితే ముందుగా ఆదాయం ఆధారంగా ట్యాక్స్ స్లాబ్ పరిధిలో వస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 

ఫారమ్ 16 లేకుండా పే స్లిప్ ఆధారంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే వేతన జీవులకు ఫారమ్ 26 ఎఎస్ అవసరమౌతుంది. ఫారమ్ 26ఏఎస్ అనేది ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేసే ఏడాది స్టేట్‌మెంట్. TRACES వెబ్‌సైట్ ద్వారా దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ పేయర్లకు TRACES వెబ్‌సైట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉంటే తక్షణం సంబంధిత ఫారమ్ 26ఏఎస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ సౌకర్యంతో కూడా ఈ అవకాశం పొందవచ్చు.

Also read: Cheapest SUV Car: దేశంలోనే అత్యంత చౌకైన ఎస్‌యూవీ ఇదే, 62 వేలు డిస్కౌంట్ కూడా

ట్యాక్స్ పేయర్లు 2022-23 ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ 2023 జూలై 31గా ఉంది. గడువు తేదీ దాటితో పెనాల్టీతో ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 

Also read: Medicines Banned: నిత్యం ఉపయోగించే 14 డ్రగ్ కాంబినేషన్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం, కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News