న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఇండేన్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకునేందుకు వీలుగా ఆ సంస్థ ఒక కామన్ మొబైల్ నెంబర్‌ను ( Common Indane gas booking number ) ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. నవంబర్ 1 నుంచి ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7718955555 నంబర్ ద్వారా దేశం ఎక్కడి నుంచి అయినా గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ ( Indane LPG gas booking ) చేసుకోవచ్చని పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదలచేసింది. ఎస్‌ఎంఎస్ లేదా ఐవీఆర్‌ఎస్ విధానంలో సిలిండర్ బుక్ చేసుకోవచ్చని.. వినియోగదారులకు 24x7 ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది. Also read : Bank Holidays in November 2020: నవంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..
దేశంలో ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఎక్కడికి వెళ్లినా ఈ మొబైల్ నెంబర్ ఆధారంగా తమ గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేసుకునేందుకు వీలు కలుగుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ( IOCL ) అభిప్రాయపడింది. వినియోగదారుడి సౌకర్యం కోసమే ఈ మొబైల్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం అమలులో ఉన్న ఇండేన్ ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ విధానం అక్టోబర్ 31 అర్థరాత్రి నుంచి రద్దు కానుందని ఐఓసి తెలిపింది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని.. బుకింగ్ సమయంలో 16 అంకెల గ్యాస్ కనెక్షన్ ఐడి నెంబర్ ఎంట్రీ చేసి గ్యాస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ నెంబర్ ఇండేన్ రికార్డులలో నమోదు కానట్టయితే.. ( How to register mobile number to book Indane LPG gas cylinder ) మీ 16 అంకెల ఐడి నెంబర్‌ను ఐవిఆర్ఎస్ కాల్ ద్వారా నమోదు చేసి మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. Also read : Gold Rate Today In India: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి యథాతథం