Infosys fires 600 Trainees after fail internal fresher assessment: ప్రముఖ ఐటీ కంపెనీ 'ఇన్ఫోసిస్' కఠిన నిర్ణయం తీసుకుంది. శిక్షణ అనంతరం 600 మంది ఫ్రెషర్లను తొలగించింది. కంపెనీ ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఎ) పరీక్షలో విఫలమవడంతో.. 600 మంది కొత్త ఉద్యోగులపై వేటు వేసింది. తొలగించబడిన వారిలో ఎక్కువ మంది జూలై 2022 తర్వాత ఉపాధి పొందిన వారే ఉన్నారట. అయితే ఈ తొలగింపులపై ఇన్ఫోసిస్ కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు కంపెనీ 'ఎఫ్‌ఎ' పరీక్ష నిర్వహిస్తుంటుంది.
'నేను 2022 ఆగస్టులో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరాను. కంపెనీలో చేరినప్పుడు మాకు శాప్ ఏబీఏపీ (SAP ABAP)లో శిక్షణ ఇచ్చింది. మా టీంలోని 150 మందిలో 60 మంది మాత్రమే ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఎ) పరీక్ష పాస్ అయ్యారు. మిగిలిన 90 మందిని తొలగిస్తున్నట్లు రెండు వారాల క్రితం నోటీసులు ఇచ్చారు' అని ఓ ఉద్యోగి తెలిపారు. అయితే ఈ తొలగింపులపై ఇన్ఫోసిస్ కంపెనీ అధికారికంగా స్పందించలేదు.
కొన్ని నెలల క్రితం ఇన్ఫోసిస్ కంపెనీ ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు అంతర్గంగా తెలిపింది. ఫ్రెషర్స్ తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాలని పేర్కొంది. పరీక్ష ఫలితాల ఆధారంగా రెండు వారాల క్రితం 600 మంది ఫ్రెషర్స్‌ను తొలగించినట్లు ఇన్ఫోసిస్ ఉన్నతస్థాయి ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. వీరంతా 8 నెలల క్రితంమే ఉద్యోగంలో చేరారట. ఇక కంపెనీ జాబ్ ఆఫర్ అందుకుని.. ఉద్యోగంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ తొలగింపులు జరిగాయి. దాంతో వారు బయాందోళకు గురవుతున్నారు.
2023 జనవరిలో ఐటీ దిగ్గజం విప్రో కూడా 452 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. శిక్షణ తర్వాత సరైన పనితీరు లేని కారణంగా వారిని తొలగించినట్లు పేర్కొంది. మరోవైపు ఆర్ధిక మాంద్యం భయాలతో దిగ్గజ ఐటీ కంపెనీలు భారీగా 'లే ఆఫ్' ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్, ట్విటర్, మెటా, అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు ఉద్యోగులకు ఇప్పటికే బై బై చెప్పాయి. స్విగ్గీ, ఫిలిప్స్, ఓఎల్ఎక్స్ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగించాయి. టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ మాత్రం ఉద్యోగులను తొలగించకుండా.. వారి జీతాల్లో కోత విధించింది.
Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాపై ఆడటమంటే విరాట్ కోహ్లీకి మహా ఇష్టం.. కారణం ఏంటో చెప్పిన భారత మాజీ కోచ్!
Also Read: Umran Malik: ఉమ్రాన్ మాలిక్ రికార్డ్ బ్రేక్ చేస్తా.. ఛాలెంజ్ విసిరిన పాకిస్తాన్ యువ పేసర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.