Costly Gift: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి తరచూ వార్తల్లో ఉండటం అలవాటు. వారానికి 7 రోజులు పనిచేయాలంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం రేపిన ఆయన అప్పుడప్పుడూ అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా మనవడికి ఇచ్చిన భారీ గిఫ్ట్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. పట్టుమని నాలుగు నెలలు కూడా నిండని మనవడికి ఏకంగా 240 కోట్ల బహుమతి ఇచ్చి ఆందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికు ఓ కుమారుడు, ఓ కుమార్తె. కుమార్తె అక్షితా మూర్తి భర్తే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. అల్లుడు బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనప్పట్నించి నారాయణ మూర్తి కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈయన సతీమణి, రచయిత్రి సుధామూర్తి రాజ్యసభకు ఎంపికయ్యారు. నారాయణ మూర్తి కూడా వివిధ అంశాలపై ఆసక్తి గొలిపే వ్యాఖ్యానాలతో వార్తల్లో ఉంటుంటారు. అతని కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణా కృష్ణన్‌లకు నవంబర్ నెలలో మగపిల్లవాడు పుట్టాడు. అతనికి ఏకాగ్రహ్ అని పేరు పెట్టారు. ఏకాగ్రహ్ ముర్తిగా పిల్చుకునే నారాయణ మూర్తి మనవడికి ఇప్పుడు కేవలం నాలుగు నెలల వయస్సు.
దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో తనకున్న 0.40 శాతం వాటా నుంచి కేవలం 0.04 శాతం వాటాను మనవడు ఏకాగ్రహ్ మూర్తికి బహుమతిగా ఇచ్చి సంచలం రేపారు నారాయణ మూర్తి. 0.04 శాతమే కదా అని తీసిపారేయవద్దు. దీని విలువ అక్షరాలా 240 కోట్ల రూపాయలు. మొత్తం షేర్లు 15 లక్షలు. ఇన్ఫోసిస్ కంపెనీలో 0.04 శాతం వాటానే 240 కోట్లంటే..మొత్తం విలువ ఎంత ఉంటుందో మరి. ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఈ షేర్లను ఆఫ్ మార్కెట్‌లో బదిలీ చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారి వైరల్ అవుతోంది.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి కూడా యూఎస్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. సారోకో అనే సంస్థను స్థాపించాడు. ఇటీవలే మార్చ్ 14న రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సుధామూర్తికి రచయిత్రిగా, సంఘ సేవకురాలిగా మంచి పేరుంది.
Also read: Jio Cricket Recharge Plans: ఐపీఎల్ 2024 క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ జియో యూజర్లకు డేటా ప్యాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook