IndiGo winter Sale 2023: భారతదేశంలో ఇండిగో విమానయాన సంస్థ ఇప్పుడు దూసుకుపోతోంది, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా వంటి సంస్థలకు ధీటుగా ఈ సంస్థ తమ సర్వీసులను నడుపుతోంది. అయితే తాజాగా ఇండిగో సంస్థ ఒక స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ప్రయాణాలపై భారీ తగ్గింపు ధరకు టికెట్లు అందిస్తామని ప్రకటించింది. డిసెంబర్ 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు ఒక స్పెషల్ సేల్ ను ఇండిగో సంస్థ నిర్వహిస్తోంది.
ఈ సేల్ ప్రకారం దేశీయంగా ప్రయాణించేందుకు 2023 రూపాయలు, అంతర్జాతీయంగా ప్రయాణించేందుకు 4999 రూపాయలకే టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. ఇక ఈ టికెట్లు 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణించే విధంగా అందుబాటులో ఉంటాయని ఈ ప్రకటనలో పేర్కొంది ఇండిగో సంస్థ. అయితే టికెట్లు అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో సంస్థ వెల్లడించింది.
అంతేకాక ఈ స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ మరే ఇతర ఆఫర్ తో కానీ మరో ప్రమోషన్ ఆఫర్ తో కానీ స్కీంతో కానీ కలిసి చేయాలనుకుంటే అది వర్తించదని పేర్కొంది. అదేవిధంగా ఇండిగో గ్రూప్ బుకింగ్స్ కి ఈ ఆఫర్ వర్తింపు చేయాలన్నా అది కుదరదని పేర్కొంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హెచ్ఎస్బీసీ కస్టమర్లు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చని ఇండిగో సంస్థ ప్రకటించింది.
తమ సంస్థ మాత్రమే కాదు విమానయాన రంగం కూడా గతం కంటే ఇప్పుడు కాస్త పుంజుకుందని ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకే ఈ ఆఫర్ తీసుకువచ్చామని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2023వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఎక్కువ మంది ప్రయాణాలకు ఆసక్తి చూపుతారని అందుకే హాలిడే సీజన్లో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ వింటర్ సేల్ తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు.
ఇండిగో సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 290 విమానాలు ఉండగా రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతోంది ఇక అందులో 76 దేశీయ డెస్టినేషన్స్ ఉండగా 26 మాత్రం అంతర్జాతీయ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఇక ఆరోజుల్లో ప్రయాణాలు చేయాలి అనుకుంటే మీరు కూడా బుక్ చేసేయండి మరి, ఇంకెందుకు ఆలస్యం.
Also Read: Reham Khan Third Marriage: ఇమ్రాన్ ఖాన్ రెండో భార్యకు మూడో పెళ్లి
Also Read: Chinmayi : నయనతార మీద అసభ్య కామెంట్లు.. ఆడపిల్లలు పుడితే వారి పరిస్థితి ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.