Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు.. త్వరలో స్లీపర్ కోచ్‌లు

Vande Bharat Express: ఇండియాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పలు మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరో అద్భుత సౌకర్యం అందించేందుకు సిద్ధమౌతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 7, 2023, 01:37 PM IST
Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు.. త్వరలో స్లీపర్ కోచ్‌లు

Vande Bharat Express: భారత ప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ఇదొక సెమీ హై స్పీడ్ రైలు. ఇతర రైళ్లతో పోలిస్తే తక్కువ సమయంలో లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సౌకర్యాలు కూడా బాగుంటాయి. మెట్రో రైళ్లకు ఉన్నట్టే ఆటోమేటిక్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ రైళ్లలో ఉన్న కొరతను తీర్చేందుకు రంగం సిద్ధమౌతోంది. 

వందేభారత్ రైళ్లు అనతికాలంలోనే ప్రజాదరణ పొందాయి. కొన్ని రూట్లలో టికెట్లు లభించడం కష్టమౌతుంది. అయితే స్పీడ్, సౌకర్యాల పరంగా బాగున్నా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకే ఒక కొరత వెంటాడింది. అది స్లీపర్ సౌకర్యం లేకపోవడం. ఇప్పుడా కొరత కూడా త్వరలో తీరనుంది. వందేబారత్ రైళ్లలో స్లీపర్ కోచ్ ప్రవేశపెట్టనుంది రైల్వే శాఖ.

వందేభారత్ రైళ్ల స్లీపర్ కోచ్‌లు తయారు చేసేందుకు వేలం పూర్తయింది. రష్యా కంపెనీ TMHతో భారతీయ రైల్వేకు చెందిన RVNLభాగస్వామ్యంతో వేలం దక్కించుకుంది. 120 కోట్లకు వందేభారత్ స్లీపర్ కోచ్ తయారు చేసేందుకు సిద్దమైంది. ఈ కంపెనీకు 120 ర్యాక్స్ తయారు చేసేందుకు 120 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. ఇప్పటికే లెటర్ ఆఫ్ అవార్డ్ కూడా జారీ అయింది.

Also Read: Covid19 Cases in India: దేశంలో కరోనా కలకలం, 24 గంటల్లో 4వేలకుపైగా కేసులు

స్లీపర్ కోచ్ ఎప్పటిలోగా సిద్ధమౌతుందనే తేదీ ఇంకా నిర్ణయం కాలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడవచ్చు. అతి తక్కువ కోట్ చేసి టెండర్ దక్కించుకున్న ఈ కంపెనీ సెక్యూరిటీ కింద 200 కోట్ల గ్యారంటీ బాండ్ జమ చేసింది. ఈ ఒప్పందం ప్రకారం 1 ఫస్ట్ ఏసీ, 3 సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ స్లీపర్ కోచ్‌లు తయారు చేయాలి. వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్ సౌకర్యం ప్రారంభమైతే ఇక ఈ రైళ్లకు మరింత ఆదరణ పెరుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

Also Read: Best SUV under 6 Lakh: టాటా పంచ్ నచ్చకపోతే.. ఈ చౌకైన ఎస్‌యూవీని కోనేయండి! ధర తక్కువ మైలేజ్ ఎక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News