Destination Alert: మీ గమ్యస్థానం వస్తున్నప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేసే సరికొత్త సౌకర్యం, ఎలాగంటే..

Destination Alert: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి డెస్టినేషన్ అలర్ట్ సౌకర్యం ప్రవేశపెడుతోంది ఇండియన్ రైల్వే. కొన్ని ఎంపిక చేసిన రైళ్లు ఈ సరికొత్త సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2022, 04:19 PM IST
Destination Alert: మీ గమ్యస్థానం వస్తున్నప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేసే సరికొత్త సౌకర్యం, ఎలాగంటే..

Destination Alert: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి డెస్టినేషన్ అలర్ట్ సౌకర్యం ప్రవేశపెడుతోంది ఇండియన్ రైల్వే. కొన్ని ఎంపిక చేసిన రైళ్లు ఈ సరికొత్త సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 

భారతీయ రైల్వే ప్రయాణీకుల కోసం సరికొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ప్రయాణీకుల గమ్యస్థానం గురించి అలర్ట్ చేయడం. దీనినే డెస్టినేషన్ ఎలర్ట్ అంటారు. ఈ కొత్త సౌకర్యాన్ని ఎంపిక చేసిన కొన్ని రైళ్లలో ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం రైలు గమ్యస్థానానికి చేరుకునే 20 నిమిషాల ముందు ఎస్ఎంఎస్ సంబంధిత ప్రయాణీకుడికి వెళ్తుంది. ఇది కేవలం రిజర్వేషన్ ప్రయాణీకులకే వర్తించనుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ బోర్డింగ్ చేసే ప్రయాణీకులు ఈ కొత్త సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

డెస్టినేషన్ ఎలర్ట్ సౌకర్యం ఇప్పటికే రైల్వేలో 139 డయల్ చేయడం ద్వారా తెలుసుకునే వీలుంది. రిజర్వేషన్ పాసెంజర్లు 139 ద్వారా ఈ సేవలు పొందవచ్చు. డెస్టినేషన్ ఎలర్ట్ కాల్ సెట్ చేస్తే..ముందుగా కన్ఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది. 

139 ఐవీఆర్ ద్వారా డెస్టినేషన్ ఎలర్ట్ యాక్టివేట్ చేసుకోవడం ఎలా

ముందుగా 139 కు మీ మొబైల్ నుంచి డయల్ చేయాలి. ఆ తరవాత కావల్సిన భాషను ఎంచుకోవాలి. ఐవీఆర్ మెనూలోంచి ఆప్షన్ 7 ఎంచుకోవాలి. డెస్టినేషన్ ఎలర్ట్ కోసం 2 ప్రెస్ చేయాలి. ఆ తరువాత పది అంకెల పీఎన్‌ఆర్ నెంబర్ నమోదు చేయాలి. ఇప్పుడు మీ పీఎన్‌ఆర్ నెంబర్ నిర్ధారణకు 1 ప్రెస్ చేయాలి. అంతే ఆ పీఎన్‌ఆర్ నెంబర్‌కు డెస్టినేషన్ ఎలర్ట్ సెట్ అవుతుంది. 

డెస్టినేషన్ ఎలర్ట్ ఎస్ఎంఎస్ ద్వారా ఎలా

139 సర్వీస్ ఆధారంగా డెస్టినేషన్ ఎలర్ట్ మెస్సేజ్ కూడా సెట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది భారతీయ రైల్వే. దీనికి మీరు చేయాల్సింది కేవలం మీ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపించడమే. మీ మొబైల్ నుంచి ALERT PNR NUMBER టైపా్ చేసి 139కు మెస్సేజ్ పంపిస్తే చాలు. డెస్టినేషన్ ఎలర్ట్ సెట్ అయినట్టు మీకు నిర్ధారణ మెస్సేజ్ అందుతుంది. 

ఇవికాకుండా వేక్‌అప్ అలార్మ్ పద్ధతి ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ సేవల్ని కూడా 139 ద్వారా పొందవచ్చు.

Also read: Rahul Gandhi Twit: లోక్‌ కళ్యాణ్ మార్గ్‌తో ప్రజలకు సంక్షేమం దక్కదు..మోదీపై రాహుల్ సెటైర్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News