Rs.266 Crore Fraud : తెరపైకి మరో మోసం.. ఆ బ్యాంకులో రూ. 266 కోట్ల మోసం!

తెరపైకి మరో మూడు కంపెనీల బాగోతం బయటపడింది. ఆ మూడు కంపెనీలు మొండి బాకాయిలుగా మారాయని.. దాదాపు రూ. 266 కోట్ల మోసం జరిగిందని ఇండియన్‌ బ్యాంక్‌ ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 04:08 PM IST
  • ఇండియన్ బ్యాంక్ లో మోసం జరిగిందని ఫిర్యాదు
  • రూ.266 కోట్ల మోసం జరిగిందని ఆర్బీఐకి తెలిపిన ఇండియన్ బ్యాంక్
  • ఆ మూడు కంపెనీ ఖాతాలని ఫ్రాడ్ ఖాతాల కింద జమకట్టిన ఇండియన్ బ్యాంక్
Rs.266 Crore Fraud : తెరపైకి మరో మోసం.. ఆ బ్యాంకులో రూ. 266 కోట్ల మోసం!

Indian bank reports to RBI over rs 266 crore fraud: ప్రభుత్వ రంగ బ్యాంకు అయినట్టి ఇండియన్ బ్యాంకు.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు మూడు కంపెనీలు తీసుకున డబ్బు తిరిగి చెల్లించటం లేదని ఫిర్యాదు చేసింది. డబ్బు చెల్లించని కారణంగా వీటిని ఫ్రాడ్ ఖాతాల కింద జమకట్టింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఆ ఖాతాదారులను ప్రాడ్ ఖాతాల గా నిర్దారించింది. 

ఈ మూడు కంపెనీల ద్వారా రూ. 266 కోట్లు మోసం జరిగిందని ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు  తెలిపింది. మొండి బాకీలుగా ఉన్న ఈ మూడు ఖాతాల గురించి వాటి వలన వాటిల్లిన నష్టం గురించి రిజర్వ్‌ బ్యాంక్‌కు దృష్టికి తీసుకెళ్లామని ఇండియన్ బ్యాంకు తెలిపింది 

Also Read: Viral Video: ఈడు మగాడ్రా బుజ్జి.. 'పడగ విప్పిన పాముకు ముద్దు'.. వహ్!

ఈ మూడు కంపెనీలలో సోనాక్‌, పుణె షోలాపూర్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌, ఎంపీ బోర్డర్‌ చెక్‌పోస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఉన్నాయి. ఈ మూడు కేసుల్లో నిధులు మోసం జరిగినట్లు ఇండియన్‌ బ్యాంకు పేర్కొంది. 

1) ఎంపీ బోర్డర్‌ చెక్‌పోస్ట్‌ డెవలప్‌మెంట్‌ - రూ. 167 కోట్లు, 

2) పుణె షోలాపూర్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ - రూ. 73 కోట్లు, 

3) సోనాక్‌ - రూ. 27 కోట్లు రూపాయలు మోసం జరిగిందని తెలిపింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News