Government Jobs: పదవ తరగతి పాసైతే చాలు..ఇండియా పోస్ట్‌లో 63 వేల జీతంతో ఉద్యోగం

Government Jobs: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. పదో తరగతి పాసైతే చాలు..ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలున్నాయి. జీతం 63 వేల వరకూ వస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 3, 2022, 03:59 PM IST
 Government Jobs: పదవ తరగతి పాసైతే చాలు..ఇండియా పోస్ట్‌లో 63 వేల జీతంతో ఉద్యోగం

Government Jobs: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. పదో తరగతి పాసైతే చాలు..ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలున్నాయి. జీతం 63 వేల వరకూ వస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం..

ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022 వెలువడింది. పోస్టాఫీసులో భవిష్యత్ నిర్మించుకునేందుకు అద్భుతమైన అవకాశం. ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పే మెట్రిక్స్ లెవెల్ 2లో స్టాఫ్ కారు డ్రైవర్ పోస్టులు 2 ఖాళీలున్నాయి.ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.inలో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 

కావల్సిన అర్హత

లైట్ అండ్ హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. మోటార్ మెకానిజం కూడా తెలిసుండాలి. వాహనానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యల్ని దూరం చేయగలగాలి. కనీసం మూడేళ్లపాటు లైట్ అండ్ హెవీ మోటార్ వాహనాలు నడిపే అనుభవముండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదవ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల వయస్సు 56 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రోహ్‌తక్, హిసార్‌లో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఏ విధమైన రిజర్వేషన్ వర్తింపు లేదు. 

అర్హులైన, అనుభవమున్న అభ్యర్ధులు అవసరమైన డాక్యుమెంట్లను The Assistant Director Postal Services(Staff) O/o the Chief Postmaster General,Haryana Circle,The Mail,Ambala Cant–133001 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. 

Also read: Post Office Scheme: ప్రతీ నెలా రూ.2500 పొందే మార్గం.. పోస్టాఫీస్‌లో ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News