Income Tax Returns: దేశంలో ప్రతి వ్యక్తి, హిందూ అవిభక్త కుటుంబం, కంపెనీలు, సంస్థలు, ఎల్ఎల్‌పి, సొసైటీ ఇలా అన్నింటిపై ఇన్‌కంటాక్స్ తప్పనిసరిగా చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు మాత్రం కొన్ని విషయాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
ప్రతియేటా ట్యాక్స్ పేయర్లు తమ ఐటీ రిటర్న్స్ నిర్ణీత వ్యవధిలోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ జూలై 31. ఈలోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేకపోతే సమస్యలు ఎదురుకావచ్చు.
అసలు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలనేది ముందుగా తెలుసుకోవడం అవసరం. ఇన్‌కంటాక్స్ శాఖ ప్రకారం ట్యాక్స్ పరిధిలో వచ్చే వ్యక్తులు లేదా వ్యవస్థలు ఇన్ కంటాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పాత ట్యాక్స్ విధానం ప్రకారం ప్రతి ఒక్కరూ 59 ఏళ్ల వయస్సు వరకూ ఏడాది ఆదాయం 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లు 60-79 ఏళ్లు ఉంటే వార్షిక ఆదాయం 3 లక్షలు దాటితే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్ల వయస్సు 80 దాటితే వార్షిక ఆదాయం 5 లక్షల వరకూ ఉండవచ్చు.
ఐటీ రిటర్న్స్ చెల్లించేందుకు కొన్ని డాక్యుమెంట్లు తప్పకుండా అవసరమౌతాయి. అందుకే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఆ కాగితాలన్నీ సిద్ధం చేసుకోవాలి. దీనికోసం బ్యాంక్ లేదా పోస్టాఫీసు సేవింగ్ పాస్‌బుక్, పీపీఎఫ్ ఎక్కౌంట్ పాస్‌బుక్, పే స్లిప్, ఆధార్ కార్డు, పాన్‌కార్డు, ఫామ్ 16 అవసరమౌతాయి. అదే సమయంలో ఏ వ్యక్తులు ఎలాంటి ఫామ్ ఫిల్ చేయాలనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇన్‌కంటాక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో చాలా ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. ట్యాక్స్ పేయర్లు తమ ఆదాయాన్ని బట్టి వీటిని ఎంచుకోవల్సి ఉంటుంది. కొన్ని ఫామ్స్ సులభంగా భర్తీ చేయవచ్చు. మీకొచ్చే లాభాల వివరాలు అందించాల్సి ఉంటుంది.ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడే మీకు ఇన్‌కంటాక్స్ నుంచి రిఫండ్ వచ్చేదుంటే క్లెయిమ్ చేయవచ్చు. క్లెయిమ్ చేసిన నెలరోజుల్లో మీకు రావల్సిన రిఫండ్ మీ ఎక్కౌంట్‌కు చేరుతుంది.
Also Read: Toyoto Innova Craze: మార్కెట్‌లో ఆ కారు క్రేజ్ ఎలాగుందంటే వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Income Tax Returns: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా..? ఈ విషయాలు మర్చిపోవద్దు!