New rules From November: రేపటి నుంచి కొత్త నెల (నవంబర్) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సహా ఇతర రంగాల పరంగా వచ్చే నెల నుంచి వివిధ మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1.ఎల్పీజీ ధర పెంపు?
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో సామాన్యులు తీవ్ర అవస్థలు (Prices hike) ఎదుర్కొంటున్నారు. ఈ మోత కొనసాగుతుండగానే ఇప్పడు మరోసారి వంట గ్యాస్ ధరలు (LPG price hike) పెంచేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ.. 15వ తేదీల్లో గ్యాస్, ఏటీఎఫ్ (విమానాల్లో వాడే ఇంధనం) ధరలను సవరిస్తుంటాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ధరలు ఇప్పటికే పెరగాల్సి ఉన్నా.. ప్రభుత్వ అనుమతుల కోసం (Cooking Gas price hike) ఆయా సంస్థలు వేచి ఉన్నట్లు తెలిసింది. కానీ ఇంకొన్నాళ్లు ధరలు పెంచకుండా ఉంటే ఆ భారం ప్రభుత్వంపై పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో నవంబర్ 1న ధరల పెంపు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాయితీ సిలిండర్ ధర సుమారు రూ.100 పెరగొచ్చని ఇప్పటి వరకు ఉన్న అంచనా.
Also read: Indian Car Market: ఇండియాలో త్వరలో లాంచ్ కానున్న కార్లు ఇవే, ప్రత్యేకతలివీ
2. వీడియో కాల్లో లైఫ్ సర్టిఫికేట్..
కరోనా సహా వయసును దృష్టిలో ఉంచుకుని పెన్షనర్లకు గుడ్ న్యూస్ (SBI Good news) చెప్పింది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, పెన్షన్ రెన్యువల్ కోసం సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్‌ను బ్యాంక్ శాఖలకు రాకుండానే సమర్పించే వీలు కల్పించనుంది. వీడియో కాల్ ద్వారా ఈ సదుపాయం (Live Certificates in Online) వినియోగించుకోవచ్చు. ఇది నిజంగా చాలా మందికి ఉపయోగకరమైన విషయం. ఎందుకంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే పని పూర్తయితే అంతకన్నా మంచి విషయమేముంటుంది. ఎస్బీఐ తెచ్చిన ఈ మార్పులు నవంబర్ 1 నుంచే అమలులోకి రానున్నాయి.
Also read: Petrol Price Hiked Again: వరుసగా ఐదో రోజు పెట్రో బాదుడు.. కొత్త రికార్డు స్థాయికి ధరలు
Also read: LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!
3.ఆ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్..
ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్తో యూజర్లకు (WhatsApp new Updates) సేవలను అందించే వాట్సాప్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పలు మోడల్స్‌లో సేవలు నిలిచిపోనున్నాయి.
ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఓఎస్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలోవాట్సాప్ సేవలు నంబర్ 1 నుంచి నిలిచిపోనున్నట్లు వాట్సాప్ తెలిపింది.
ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వెర్షన్ ఫోన్లలో కూడకా వాట్సాప్ నంబర్ 1 తర్వాత పని చేయదు. ప్రస్తుతం పాత ఓఎస్‌లతో పని చేస్తున్న ఫోన్ల జాబితాను కూడా వాట్సాప్ అందుబాటులో ఉంచింది.
Also read: WhatsApp to Stop Some Phones: నవంబర్ 1 నుంచి ఆ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు!
Also read: Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!
4. బ్యాంక్ ఆఫ్ బరోడా ఛార్జీల బాదుడు షురూ..
ప్రభుత్వం రంగ దిగ్గజ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నెలలో మూడు కంటే ఎక్కువ సార్లు నగదు డిపాజిట్ చేస్తే రూ.40 ఛార్జీ వసూలు చేయనుంది. అదే విధంగా నెలలో మూడు కంటే ఎక్కువసార్లు ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేస్తే రూ.100 ఛార్జీ విధించనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. అయితే ఈ కొత్త నిబంధనలు రేపటి నుంచే (నవంబర్ 1) అమలులోకి రానున్నాయి.
Also read: RBI Governor: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం పొడగింపు- మరో మూడేళ్లు సేవలు!
Also read: JioPhone Next: జియోఫోన్ నెక్ట్స్ గురించి బిగ్ అప్డేట్- ధర, ఫీచర్ల వివరాలు వెల్లడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి