Income Tax Calculation: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ఉద్యోగులు, రైతులు సహా వ్యాపార వర్గానికి అనేక అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా పన్ను చెల్లింపుదారులకు వివిధ సౌకర్యాలు కల్పించడంతోపాటు పన్ను శ్లాబులను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తోంది ఆర్థికశాఖ. పన్ను చెల్లింపుదారుల కోసం మోదీ ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని, పాత పన్నును ప్రారంభించింది.
రెండు పన్ను స్లాబ్‌లలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత విధానాన్ని మాత్రమే ఎంచుకుంటారు. రెండు పన్నులలో రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ట్యాక్స్ నుంచి మినహాయించారు. అయితే 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను ఉంటుంది. పాత విధానంలో ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం ట్యాక్స్ చెల్లించాలి. వార్షిక ఆదాయం 10 నుంచి 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మీ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు ఉండి మీరు అద్దె ఇంట్లో ఉన్నారని అనుకుందాం. మీరు ఏడాదికి ఎంత ట్యాక్స్ చెల్లించాలో తెలుసుకుందాం.. పూర్తి లెక్కలు ఇలా..
1.మీ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను తగ్గించిన తర్వాత మీ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.9.50 లక్షలు అవుతుంది.
2. ఆ తరువాత మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఆదా చేసినట్లు లెక్కిస్తారు. ఇందులో మీరు ట్యూషన్ ఫీజు, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్ (ELSS), ఈపీఎఫ్ మొదలైనవాటిని క్లెయిమ్ చేయవచ్చు. ఈ విధంగా మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.8 లక్షలు అవుతుంది.
3. లక్ష రూపాయల వరకు ఇంటి అద్దె అలవెన్స్ (HRA)పై మీరు ఇంటి యజమాని పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు లక్ష రూపాయల వరకు అద్దె చెల్లిస్తే.. మీ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.7 లక్షలకు తగ్గుతుంది. ఈ మొత్తంపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
4. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం చొప్పున రూ.12,500 పన్ను విధించారు. దీని తర్వాత 5 నుంచి 7 లక్షల ఆదాయంపై 20 శాతం చొప్పున 40 వేల పన్ను విధించారు. ఈ విధంగా 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు మొత్తం పన్ను రూ.52,500గా ఉంది.
5.ఇప్పుడు దీనిపై మీరు 4 శాతం చొప్పున సెస్ చెల్లించాలి. అంటే రూ.2,100. ఈ విధంగా 10 లక్షల జీతంపై మీ మొత్తం ఆదాయపు పన్ను రూ.54,600.
Also Read: Aadhaar Update: గుడ్‌న్యూస్.. ఇంట్లోనే కూర్చొని ఆధార్ అప్‌డేట్ చేసుకోండి
Also Read: Insurance New Rules: ఇన్సూరెన్స్ పాలసీలో జనవరి 1 నుంచి మారిన నిబంధనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Income Tax: న్యూ ఇయర్‌లో పన్ను చెల్లింపుదారులకు షాక్.. రూ.54 వేల ట్యాక్స్ చెల్లించాల్సిందే..!