Hyundai Sales in February: హ్యుందాయ్ విక్రయాలు ఫిబ్రవరి నెలలో పెరిగాయి. గతేడాదితో పోలిస్తే హుందాయ్ మొత్తం అమ్మకాలు ఈ మధ్యకాలంలో పెరిగాయి. కానీ ఎగుమతులు తగ్గాయి. ఇండియా మొత్తం విక్రయాలు ఫిబ్రవరిలో వార్షిక ప్రాతిపదికన 4.5 శాతం పెరిగి 60,501 యూనిట్లకు చేరుకోగా.. గత ఏడాది ఫిబ్రవరిలో మొత్తం విక్రయాలు 57,851 యూనిట్లు జరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. గత నెలలో మొత్తం అమ్మకాల పరంగా హ్యుందాయ్‌కి మంచి మార్కెట్ ఉంది. దేశీయ హోల్‌సేల్ అమ్మకాలు 7 శాతం పెరిగి 50,201 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో కాస్త పెరిగింది. గతేడాది ఇదే నెలలో (ఫిబ్రవరి 2023) 47,001 కార్లను విక్రయించింది.
Also Read: Samantha Ruth Prabhu: బాత్రూమ్‌లో హాట్ హాట్ ఫోజులిచ్చిన సమంత
కాగా.. కంపెనీ ఎగుమతులు గత నెలలో 5 శాతం తగ్గుదల కనిపించింది. 10,300 యూనిట్లకు పడిపోయాయి. ఏడాది క్రితం ఫిబ్రవరి నెలలో 10,850 యూనిట్లు ఉండగా.. ఈ ఫిబ్రవరితో పాటు జనవరిలో కూడా ఈ కంపెనీ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన తగ్గాయి. అయితే మొత్తం అమ్మకాల పరింగా చూస్తే కాస్త పెరిగింది. జనవరి నెలలో హ్యుందాయ్ హోల్‌సేల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం పెరుగుదలతో 67,615 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దేశీయ అమ్మకాలు 14 శాతం పెరిగి 57,115 యూనిట్లకు చేరుకుందని సంస్థ ప్రకటించింది. అయితే కార్ల ఎగుమతి 14 శాతం తగ్గి 10,500 యూనిట్లకు చేరుకుందని తెలిపింది. గతే ఏడాది జనవరిలో 12,170 యూనిట్లుగా నమోదైందని పేర్కొంది.
ఫిబ్రవరి నెలలో అత్యధిక విక్రయాలు జరిగిన కంపెనీలు
==> మారుతీ సుజుకి ఫిబ్రవరిలో మొత్తం 1,97,471 యూనిట్లను విక్రయించింది.
==> హ్యుందాయ్ ఫిబ్రవరిలో మొత్తం 60,501 యూనిట్ల అమ్మకాలు చేపట్టింది.
==> టాటా మోటార్స్ ఫిబ్రవరిలో మొత్తం 51,321 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది.
==> ఫిబ్రవరిలో మహీంద్రా 42,401 ప్యాసింజర్ వాహనాలను అమ్మినట్లు సంస్థ ప్రతినిధులలు తెలిపారు.
==> టయోటా ఫిబ్రవరిలో 25,220 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.
Also Read: Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter