Diwali Discount Offer: దీపావళికి ముందే ఈ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్, ఏకంగా 2 లక్షల తగ్గింపు

Diwali Discount Offer: మరి కొద్దిరోజుల్లో దీవాళి పండుగ వస్తోంది. కారు కొనాలనే ఆలోచన ఉండేవారు దీవాళి కోసం నిరీక్షిస్తుంటారు. కారణం దీవాళికి కారు కంపెనీలు ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగమే ఈ ఆఫర్.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 27, 2023, 10:35 AM IST
Diwali Discount Offer: దీపావళికి ముందే ఈ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్, ఏకంగా 2 లక్షల తగ్గింపు

Diwali Discount Offer: హ్యుండయ్ కంపెనీ దీవాళికి ముందే ఆఫర్ ప్రకటించేసింది. హ్యుండయ్ కోనా ఎలక్ట్రిక్ కారు. ఇది 39 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఈ బ్యాటరీ సామర్ధ్యం ఏకంగా 452 కిలోమీటర్లు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనే ఆలోచన ఉంటే కాస్త ఆగండి. హ్యుండయ్ కంపెనీకు చెందిన ఈ ఎస్‌యూవీ కొంటే ఏకంగా 2 లక్షల రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. హ్యుండయ్ కోనా ఈవీ ఇది. ఇండియాలో హ్యుండయ్ కంపెనీకు చెందిన ఏకైక ఈవీ కారు ఇదే. సెప్టెంబర్ నెలలో కంపెనీ ఈ కారుపై 2 లక్షల రూపాయలు డిస్కౌంట్ ప్రకటించింది. హ్యుండయ్ కోనా ఈవీ కొనుగోలుపై కస్టమర్లకు సెప్టెంబర్ 2023 నుంచి 2 లక్షల రూపాయలు డిస్కౌంట్ అందుతుంది. ఇది క్యాష్ డిస్కౌంట్. హ్యుండయ్ కోనా ఈవీ ధర ప్రస్తుతం ఎక్స్ షోరూం అయితే 23.84 లక్షల నుంచి 24.03 లక్షల వరకూ ఉంది. 

హ్యుండయ్ కోనా ఈవీ ఎలక్ట్రిక్ మోటార్ 39 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో అనుసంధానితమైంది. ఈ బ్యాటరీ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ 452 కిలోమీటర్లు ఉంది. ఇక సామర్ధ్యం గురించి పరిశీలిస్తే ఈ ఎస్‌యూవీ 0 నుంచి 100 కిలోమీటర్లు వేగాన్ని కేవలం 9.7 సెకన్లలో అందుకుుంటుంది. సింగిల్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇందులో ఈకో, ఈకో ప్లస్, కంఫర్ట్, స్పోర్ట్ వంటి నాలుగు వేరియంట్లు ఉన్నాయి.

ఇందులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రేర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, 10 రకాలుగా పవర్ అడ్జెస్ట్‌మెంట్ అయ్యే డ్రైవింగ్ సీట్, 6 ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆల్ డిస్క్ బ్రేక్, హిల్ అసిస్ట్ కంట్రోల్ , రేర్ కెమేరా వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Also read: Most Expensive Currency: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ ఏదో తెలుసా..! డాలర్ కంటే చాలా ఎక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News