Corbevax vaccine: పిల్లలకూ కొర్బీవాక్స్​- డీసీజీఐ అనుమతులు మంజూరు!

Corbevax vaccine: దేశీయంగా పిల్లలకోసం మరో కరోనా వ్యాక్సిన్​కు వినియోగ అనుమతులు లభించాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న బయోలాజికల్ ఈ టీకాకు ఈ అనుమతులు వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 08:32 PM IST
  • పిల్లకు అందుబాటులోకి మరో కరోనా వ్యాక్సిన్​
  • 12 ఏళ్ల వయసు వారికి ఇచ్చేందుకు అనుమతులు!
  • దేశీయంగా అభివృద్ధి చేసిన టీకా
Corbevax vaccine: పిల్లలకూ కొర్బీవాక్స్​- డీసీజీఐ అనుమతులు మంజూరు!

Corbevax vaccine: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న మరో ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​కు అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. 'బయోలాజికల్ ఈ' అభివృద్ధి చేసిన కొవిడ్ టీకాకు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సోమవారం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది.

బయోలాజికల్ ఈ కరోనా వ్యాక్సిన్​ కొర్బీవాక్స్​(Corbevax)గా అందుబాటులోకి రానుంది. నిజానికి 2021 డిసెంబర్​ 28నే ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. తాజాగా.. 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కూడా ఈ టీకాను వేసేందుకు అనుమతులు ఇచ్చింది డీసీజీఐ. దేశీయంగా అభివృద్ధి చేసి.. వినియోగ అనుమతులు పొందిన మూడో వ్యాక్సిన్​గా కొర్బీవాక్స్​ నిలిచింది.

ప్రస్తుతానికి 15 ఏళ్లు ఆపై వయసుల వారికి మాత్రమే!

దేశీయంగా ఈ ఏడాది జనవరి నుంచి పిల్లలకు టీకాలు వేస్తున్నారు. 15 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే కొర్బీవాక్స్​ ఇప్పుడు 12 ఏళ్ల వారికి ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతులు పొందినప్పటికీ.. ప్రభుత్వం ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కొన్ని రోజులు 15 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఈ టీకాలు వేసే అవకాశముంది.

కొర్బీవాక్స్ గురించి..

ఈ వ్యాక్సిన్​ కూడా రెండు డోసుల్లో వేయాల్సి ఉంటుంది. రెండు డోసుల మధ్య గ్యాప్ 28 రోజులు. ఈ టీకాను 2-8 డిగ్రీల ఊష్టోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఒక్కో డోసు 5 ఎంఎల్​ చొప్పున.. మొత్తం 10 ఎంఎల్​ ఇవ్వాల్సి ఉంటుంది.

Also read: Flipkart Sale: ఫ్లిప్​కార్ట్ కూల్ ఆఫర్స్.. రూ.12 వేల కూలర్ కేవలం రూ.7,515కే!

Also read: SBI Alert: ఈ ఆరు జాగ్రత్తలతో మీ ఆన్​లైన్ పేమెంట్స్ అత్యంత సురక్షితం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News