Honda Amaze and Honda City: హోండా సిటీ లాంటి రిచ్ లుక్ కలిగిన సెడాన్.. ధర కూడా రూ. 4.5 లక్షలు తక్కువ!

Honda Amaze and Honda City: హోండీ సిటీ లాంటి సౌకర్యవంతమైన, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కలిగిన చౌక సెడాన్ కారు కొనే ఆలోచన ఉంటే..హోండా ఎమేజ్ మంచి ఆప్షన్. హోండా సిటీ, హోండా ఎమేజ్‌కు పోలిక లేకపోయినా..హోండా ఎమేజ్ బెస్ట్ కారుగా చెప్పవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 7, 2023, 09:43 AM IST
Honda Amaze and Honda City: హోండా సిటీ లాంటి రిచ్ లుక్ కలిగిన సెడాన్.. ధర కూడా రూ. 4.5 లక్షలు తక్కువ!

Honda Amaze Vs Honda City: హోండా సిటీ నిజంగా ఓ అద్బుతమైన కారు. ఇండియన్ కార్ మార్కెట్‌లో దీర్ఘకాలంగా నిలదొక్కుకుంది. ఇటీవల ఈ కారు 4వ జనరేషన్ సిటీ సెడాన్ క్లోజ్ చేసి 5వ జనరేషన్ సెడాన్ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ కారు ధర ఏకంగా 11.5 లక్షల రూపాయలుంది. ధర చూసి భయపడే పరిస్థితి. ఎందుకంటే అందరికీ అనువైన ధర కాదిది. 

అందుకే హోండా ఎమేజ్ మంచి ఆప్షన్ కాగలదని చెబుతున్నాం. హోండా సిటీ లాంటి కంఫర్ట్, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, నమ్మకం కలిగిన చౌక ధర సెడాన్ కారు ఇది. ఈ రెండింటికీ పోలిక లేదు. హోండా ఎమేజ్ కంటే హోండా సిటీ లెవెల్ ఎక్కువే. మోర్ లగ్జరియస్, మోర్ ఫీచర్డ్ , మోర్ ఎఫిషియెంట్ కారు హోండా సిటీ. అదే హోండా ఎమేజ్ మాత్రం ఒక ఎంట్రీ లెవెల్ కాంపాక్ట్ సెడాన్ కారు. దీనిని మినీ హోండా సిటీగా పిలుస్తారు. 

హోండా ఎమేజ్ ధర, ఫీచర్లు

హోండా ఎమేజ్ ధర 6.99 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. టాప్ వేరియంట్ ధర కూడా హోండా సిటీ బేసిక్ వేరియంట్ కంటే తక్కువే. రెండు కార్ల బేసిక్ వేరియంట్ ధరల వ్యత్యాసం పోల్చుకుంటే 4.5 లక్షలు ఉంటుంది. హోండా ఎమేజ్ మూడు వేరియంట్లు ఈ, ఎస్, వీఎక్స్‌లో అందుబాటులో ఉంది. ఇదొక 5 సీటర్ సెడాన్ కారు. 

హోండా ఎమేజ్ ఇంజన్ ప్రత్యేకతలు

హోండా ఎమేజ్‌లో కేవలం ఒకే ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 90 పీఎస్ పవర్, 110 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో ముందు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉండేది. కానీ తరువాత నిలిచిపోయింది. హోండా ఎమేజ్‌లో 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ స్టాండర్డ్ ఉంటుంది. ఈ కారు మైలేజ్ 18.6 కిలోమీటర్ల వరకూ ఉంటుంది.

ఫీచర్లు

హోండా ఎమేజ్‌లో ఆటో ఎల్ఈడీ ప్రోజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, 15 ఇంచెస్ డ్యూయల్ టోన్ ఎల్లాయ్ వీల్స్, 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, పార్కింగ్ సెన్సార్ వంటి ప్రత్యేకతలున్నాయి.

Also Read: Force Cityline: 7 సీటర్ కారెందుకిక, తక్కువ ధరలో 10 సీటర్ అందుబాటులో

Also Read: Tata New Car Launch 2023: మార్కెట్‌లో సంచలనం సృష్టించనున్న టాటా.. త్వరలోనే 4 ఎస్‌యూవీలు రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News