Purchage Honda Activa 6G just Rs 18000 on EMI: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ ఏదంటే.. మొదటగా వినిపించే పేరు 'హోండా యాక్టివా'. ఎందుకంటే ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా హోండా యాక్టివా ఉంటుంది. ప్రతి నెల లక్షల యూనిట్లు అమ్ముడవుతాయి. హోండా ఎప్పటికప్పడు అప్ డేటెడ్ స్కూటర్‌ను తీసుకొస్తూ దూసుకుపోతుంది. ఇక హోండా యాక్టివా 6జీ (Activa 6G) 109.51cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో 7.79 హార్స్‌పవర్ మరియు 8.79 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ మరియు హోండా యొక్క మెరుగైన స్మార్ట్ పవర్ (ESP) సాంకేతికతతో వస్తుంది.
Honda Activa 6G Features:
యాక్టివా 6జీ (Activa 6G) యొక్క ముఖ్య లక్షణాలలో బాహ్య ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, LED హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్‌లైట్, డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు ఇంజిన్ స్టార్ట్-స్టాప్ స్విచ్ ఉన్నాయి. ఇది హోండా యొక్క కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS)తో వస్తుంది. ఇది బ్రేకింగ్ సమయంలో మెరుగైన భద్రతను ఇస్తుంది. కేవలం ఇలాంటి బెస్ట్ స్కూటర్‌ను మీరు రూ.18,000లకి ఇంటికి తెచ్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
Honda Activa 6G Price:
హోండా యాక్టివా 6జీ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.74536. డీలక్స్ వేరియంట్ ధర రూ.77036లుగా ఉంది. ప్రీమియం వెర్షన్ ధర రూ. 76859లుగా ఉంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరలు. ఈ ధరలు ఆన్ రోడ్ అయితే మరింత పెరగనున్నాయి. అయితే మీకు కావాలంటే.. హోండా యాక్టివా 6జీ స్కూటర్‌ను లోన్‌పై కొనుగోలు చేయవచ్చు. 18 వేలకే హోండా యాక్టివాను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. హోండా యాక్టివా ఈఎంఐ కాలిక్యులేటర్‌ని ఓసారి చూద్దాం.
Honda Activa 6G EMI Calculator:
హోండా యాక్టివా 6జీ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 86800. మీరు ఈ వేరియంట్‌ను లోన్‌పై కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. మీరు మీ ఎంపిక ప్రకారం ఎక్కువ డౌన్ పేమెంట్ ఇవ్వవచ్చు, వివిధ బ్యాంకులలో వడ్డీ రేటు భిన్నంగా ఉంటుంది మరియు లోన్ కాలపరిమితి 1 నుంచి 7 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. రూ. 18000 (20% డౌన్ పేమెంట్), వడ్డీ రేటు 10% మరియు 3 సంవత్సరాల రుణ కాలవ్యవధిని ఎంచుకుంటే.. మీరు ప్రతి నెలా రూ. 2222 ఈఎంఐ చెల్లించాలి. మొత్తం లోన్ మొత్తానికి (రూ. 68,878) మీరు అదనంగా రూ. 11000 చెల్లించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.