Home Loan vs Renting: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల ఈ కలను సాకారం చేసుకునేందుకు, ప్రతి ఒక్కరు తాము సంపాదించే సంపాదనలో కొద్ది మొత్తం కూడా పెడుతూ ఉంటారు. సొంతిల్లు ఉంటే ఆత్మగౌరవం లభిస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అలాగే సొంత ఇంట్లో ఉండటం అంటే ఒక ఆర్థిక భద్రత కల్పిస్తుంది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో సొంత ఇల్లు నిర్మించుకోవడం అనేది సుదూర స్వప్నంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరగడంతో సొంత ఇంటి నిర్మాణం అనేది కలగానే మిగిలిపోతోంది. ఇక నగరాల్లో అపార్ట్మెంట్లను ఫ్లాట్లను కొనుగోలు చేయడం కూడా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అపార్ట్మెంట్ ప్లాట్లు కొనుగో కొనుగోలు చేయాలన్నా కూడా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్యులకు సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు బ్యాంకులో హోమ్ లోన్స్ ప్రవేశపెట్టాయి. మీరు డబ్బు కూడా పెట్టి ఇల్లు కొనుగోలు చేయాలంటే కనీసం 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యకాలంలో ధరలు పెరిగి మీరు ఇల్లు కొనుగోలు చేసే స్వప్నం నెరవేరదు. అదే మీరు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేసినట్లయితే, ప్రతినెల సులభ వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లిస్తే నిర్ణీత సమయంలో ఆ ఇల్లు మీ సొంతం అవుతుంది.
అద్దె ఇల్లు బెటరా...సొంత ఇల్లు బెటరా..?
అయితే కొద్దిమంది సొంత ఇంటి కన్నా కూడా అద్దె ఇంట్లో ఉంటేనే బెటర్ అంటూ ఉంటారు. సొంత ఇంటి వేటలో దశాబ్దాల తరబడి బ్యాంకు వాయిదాలను చెల్లించడం కష్టతరమైన పని అని సూచనలు చేస్తూ ఉంటారు. ఇందులో వారి వాదన కరెక్టా కాదా అన్న సంగతి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నిజానికి అద్దె ఇంట్లో మీరు ఉన్నప్పుడు మీరు మార్కెట్ ధరకు తగ్గట్టుగా అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరాలు పెరిగే కొద్దీ అద్దె ధర కూడా పెరుగుతూ వస్తుంది. తద్వారా మీరు చెల్లించే అద్దె ధర పెరుగుతూ ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు మీరు పూర్తిస్థాయిలో అద్దెను చెల్లించలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఆర్థికంగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అదే మీరు హోమ్ లోన్ ద్వారా ఇల్లు కొనుగోలు చేసినట్లయితే. మొదట్లో నెలసరి వాయిదా మొత్తం కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. ఒక్కోసారి అది మీ జీవితంలో సగం వరకు ఉండవచ్చున. కానీ ఈ క్రమంలో హోమ్ లోన్ తీరే నాటికి ఆ ఇల్లు మీ సొంతం అవుతుంది అన్న సంగతి గుర్తుంచుకోవాలి.
అద్దె ఇంటితో మీకు నష్టమే:
ఉదాహరణకు మీరు ఒక ఇంటికి నెలకు పదివేల రూపాయల అద్దె చెల్లిస్తున్నారు అనుకుందాం. అలా మీరు ప్రతి సంవత్సరం 1.20 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుంటారు. అయితే సంవత్సరానికి కనీసం 10% అదే పెరిగిన 10 సంవత్సరాల్లో మీ అద్దె రెండింతలు అవుతుంది. అదే సమయంలో మీ ఆదాయం పది సంవత్సరాల్లో రెండింతలు అయితే అవ్వచ్చు. లేకపోతే కాకపోవచ్చు. కానీ అదే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది.
హోం లోన్ ద్వారా సొంత ఇంటితో ఎలా లాభమో చూద్దాం:
ఇప్పుడు రెండో ఉదాహరణ చూద్దాం బ్యాంకు నుంచి 30 లక్షల రూపాయలు రుణం తీసుకొని ఒక ఇల్లు కొనుగోలు చేశారు అనుకుందాం. దీన్ని మీరు 25 సంవత్సరాల కాల వ్యవధితో 9 శాతం బ్యాంకు వడ్డీ రేటు తో నెలకు 25 వేల రూపాయలు నెల వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో మీరు ప్రారంభంలో మీ వేతనం రూ.50 వేలు అనుకుంటే అందులో సుమారు సగం వరకు నెల వాయిదా రూపంలో బ్యాంకులో జమ అవుతుంది. అలా ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు వరకు గడిచింది అనుకుందాం. ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో మీ వేతనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మీ నెల వాయిదా మాత్రం 25 వేల రూపాయలు గానే ఉంటుంది. అప్పుడు మీకు కాస్త భారం తగ్గుతుంది. మరో ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత మీ నెల వాయిదా 25 వేల రూపాయలు గానే ఉంటుంది. ఇలా మొత్తం 25 వ సంవత్సరం నాటికి మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మొదటి నెల ఎంత చెల్లించారో చివరి నెల కూడా అంతే ఉండే అవకాశం ఉంది. గడచిన 25 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం ప్రాతిపదికన మీ వేతనం చాలా రెట్లు పెరిగి ఉంటుంది. కానీ మీ బ్యాంకు నెల వాయిదా మాత్రం అంతే ఉంటుంది. పైగా ఈ 25 సంవత్సరాల్లో మీ ఆస్తి విలువ 30 లక్షల నుంచి 2-3 కోట్లు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక చిన్న లాజిక్ ఏమిటంటే, మీరు ఈ ఆస్తిని 25 సంవత్సరాల క్రితం కేవలం 30 లక్షలకే కొనుగోలు చేశారన్న సంగతి గుర్తుంచుకోవాలి. అదే మీరు 25 సంవత్సరాలు డబ్బు పొదుపు చేసి ఈరోజు మీరు ఆస్తిని కొనుగోలు చేయాలంటే సాధ్యం అయ్యేది కాదు. ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ అమౌంట్ కింద సుమారు 40 లక్షల వరకు చెల్లించి ఉండవచ్చు. అలా మీరు చూసుకున్నట్లయితే వడ్డీతో కలిపి మీరు రెండింతలు చెల్లించి ఉండవచ్చుస కానీ పెరిగిన ఆస్తి విలువతో అది బెరీజు వేసుకుంటే చాలా తక్కువ అని చెప్పవచ్చు పైగా ఇల్లు మీ సొంతం అవుతుంది.
కానీ అద్దె ఇంటిలో ఈ సౌలభ్యం ఉండదు. ఎన్ని సంవత్సరాలు గడిచిన ఇల్లు యజమాని సొంతమే కానీ మీ సొంతం కాదు. అద్దె పెరుగుతుంది కానీ బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐ వాయిదా పెరగదు. అన్న సంగతి గుర్తుంచుకోవాలి. మొదట్లో కాస్త భారం అనిపించినా మీ వేతనం పెరిగే కొద్దీ మీరు చెల్లించాల్సిన నెల వాయిదా 10 సంవత్సరాల తర్వాత చిన్నగా అవడం మొదలు పెడుతుంది. చివరికి వచ్చేనాటికి మీ నెల వాయిదా అనేది చాలా తక్కువ మొత్తం అనిపించడం సహజం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter