Gautam Adani: కొనసాగుతున్న అదానీ గ్రూప్ పతనం, బిలియనీర్ జాబితాలో 22వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద రోజురోజుకూ ఆవిరౌతోంది. ప్రపంచం కుబేరుల్లో అతని స్థానం దిగజారిపోతోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ఇంకా వెంటాడుతూనే ఉంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 4, 2023, 07:20 AM IST
  • కొనసాగుతున్న అదానీ గ్రూప్ షేర్ల పతనం
  • ప్రపంచ కుబేరుల జాబితాలో 22వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
  • పదిరోజుల్లో 8 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన అదానీ గ్రూప్
Gautam Adani: కొనసాగుతున్న అదానీ గ్రూప్ పతనం, బిలియనీర్ జాబితాలో 22వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్‌పై ఇంకా కొనసాగుతోంది. అదానీ‌ గ్రూప్ షేర్ల పతనం ఆగడం లేదు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల జాబితాలో టాప్ 20 నుంచి వైదొలగి 22వ స్థానానికి పడిపోయారు. ఆ వివరాలు మీ కోసం..

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ. నిన్న మొన్నటి వరకూ ఓ విజయవంతమైన బిజినెస్ సామ్యాజ్యాధినేత. అతని షేర్‌పై అపారమైన నమ్మకం ఇన్వెస్టర్లకు. అంతులేని లాభాల్ని ఆర్జించే షేర్. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు అదానీ అంటే నమ్మకం కోల్పోయిన ఇన్వెస్టర్లు. కేవలం పదిరోజుల్లోనే అంతా మారిపోయింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావం ఆ కంపెనీ ఆర్ధిక పరిస్థితిని తలకిందులు చేసేసింది. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పోగొట్టేలా చేసింది. 

షేర్ మార్కెట్ అవకతవకలు, కృత్రిమంగా షేర్ విలువ పెంచడం, ఎక్కౌంటింగ్ ఫ్రాడ్, అవినీతి, మనీ లాండరింగ్ వంటి తీవ్ర నేరారోపణల్ని మోపింది హిండెన్‌బర్గ్ సంస్థ. జనవరి 25న నివేదిక విడుదల చేసినప్పటి నుంచి అదానీ గ్రూప్ పతనం ప్రారంభమైంది. షేర్ల ధరలు అంతకంతకూ పడిపోవడం మొదలైంది. చూస్తుండగానే అదానీ సంపద ఆవిరి కావడం ప్రారంభమైంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ..అంతకంతకూ పడిపోసాగారు. కేవలం పది రోజుల వ్యవధిలో 8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఫలితంగా టాప్ 20 బిలియనీర్ల జాబితా నుంచి పడిపోయి..22వ స్థానానికి చేరుకున్నారు. 

జనవరి 26వ తేదీన మొదలైన అదానీ గ్రూప్ షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది.షేర్లపై పలు రెట్లు లోయర్ సర్క్యూట్ విధించాల్సిన పరిస్థితి. గౌతమ్ అదానీ ఆస్థుల విలువ ఇప్పుడు 61.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదానీ షేర్ల పతనంతో స్టాక్ మార్కెట్‌లో మార్కెట్ క్యాప్ 110 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే నష్టపోయింది. 

అటు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వంటి స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీ షేర్లపై నిఘా ఉంచాయి. అదే సమయంలో అమెరికాకు చెందిన షేర్ మార్కెట్ డోవ్ జోన్స్ జాబితా నుంచి అదానీ ఎంటర్‌ప్రైజస్‌ను తొలగించింది. ఇక క్రెడిట్ సూయిస్, సిటీ గ్రూప్ వంటి పెద్ద బ్యాంకింగ్ సంస్థలు అదానీ గ్రూప్ బాండ్ల తాకట్టు ద్వారా రుణాలివ్వడం నిలిపివేశాయి. అంటే భవిష్యత్తులో అదానీ గ్రూప్‌కు మూలధనం సమకూర్చడం కష్టమేనని తెలుస్తోంది. 

Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News