Hindenburg Research: మోసం మోసమే అవుతుంది..దేశభక్తి ముసుగులో కప్పిపుచ్చడం సాధ్యం కాదు

Hindenburg Research: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ అవినీతి, మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల తరువాత ఆ కంపెనీ షేర్ల పతనం కొనసాగుతోంది. మరోవైపు హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ 413 పేజీల స్పష్టీకరణ జారీ చేసింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 30, 2023, 02:54 PM IST
Hindenburg Research: మోసం మోసమే అవుతుంది..దేశభక్తి ముసుగులో కప్పిపుచ్చడం సాధ్యం కాదు

అదానీ గ్రూప్‌పై ఆరోపణలు ఇండియాపై దాడిగా అదానీ గ్రూప్ అభివర్ణించడాన్ని హిండెన్‌బర్గ్ సంస్థ కొట్టిపారేసింది. ఇండియా ఓ సజీవ ప్రజాస్వామ్యమని..ఎదుగుతున్న మహాశక్తి అని..అయితే అదానీ గ్రూప్ వ్యవస్థీకృత దోపిడీ ఇండియా భవిష్యత్తును నిలిపివేస్తోందని హిండెన్‌బర్గ్ స్పష్టం చేసింది. 

అదానీ గ్రూప్ వివరణ

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై మోసం, అవినీతి ఆరోపణలు చేసింది. ఆ తరువాత గ్రూప్ షేర్లు పతనమయ్యాయి. దాంతో అదానీ గ్రూప్ స్పందిస్తూ 413 పేజీల వివరణ జారీ చేసింది. హిండెన్‌బర్గ్ ద్వారా ఇండియాపై ఓ కుట్ర ప్రకారం దాడి జరిగిందని అదానీ గ్రూప్ ఆరోపించింది. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలన్నీ కేవలం అబద్ధాలని కొట్టిపారేసింది. ఈ నివేదిక ఓ కృత్రిమ మార్కెట్ తయారు చేసే ప్రయత్నమని..తద్వారా షేర్ల ధరను తగ్గించి..అమెరికన్ కంపెనీలకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చడమేనని అదానీ గ్రూప్ తెలిపింది. తప్పుడు వాస్తవాల ఆధారంగా ఈ రిపోర్ట్ తయారైందని వెల్లడించింది. ఓ ప్రముఖ కంపెనీపై అనుకోని దాడి మాత్రమే కాదని..ఇండియాపై ఇండియా సంస్థల స్వతంత్రత, అఖండత, ఇండియా అభివృద్ధిపై కుట్ర పూరితంగా చేసిన దాడి అని అదానీ గ్రూప్ అభివర్ణించింది. 

ఆరోపణలకు కట్టుబడిన హిండెన్‌బర్గ్

అయితే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ తన నివేదికపై ఇప్పటికీ కట్టుబడి ఉంది. రెండేళ్ల పరిశోధనలో అదానీ గ్రూప్ ఏ విధంగా దశాబ్దాలుగా షేర్లలో అవకతవకలు, మోసాలకు పాల్పడిందో వివరించామని తెలిపింది. మోసం ఎప్పుడూ మోసమో అవుతుందని హిండెన్‌బర్గ్ సంస్థ తేల్చి చెప్పింది. తాము అదానీ గ్రూప్‌కు 88 ప్రశ్నలు సంధిస్తే అందులో 62 ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడంలో అదానీ గ్రూప్ విఫలమైందని హిండెన్‌బర్గ్ తెలిపింది. షార్ట్ సెల్లింగ్‌లో ప్రావీణ్యమున్నన్యూయార్క్‌కు చెందిన ఓ సంస్థ చేసిన రిపోర్ట్‌తో కేవలం రెండ్రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 50 బిలియన్ డాలర్లకు పైగా తగ్గిపోయింది. అదానీకు స్వయంగా 20 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. అదానీ సంపద కూడా 20 శాతం తగ్గిపోయింది. 

అదానీ గ్రూప్ 413 పేజీల వివరణ ఇచ్చినా..మరొకటిచ్చినా దేశభక్తి ముసుగులో ఆ మోసాన్ని కప్పేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది హిండెన్‌బర్గ్. అదానీ గ్రూప్‌పై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పింది. 

Also read: ITR 2023-24: ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రయోజనాలు కలిగే 7 ముఖ్యమైన అలవెన్సులు ఇవే, చాలామందికి తెలియదు కూడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News